(Source: ECI/ABP News/ABP Majha)
Brahmamudi June 16th: రాహుల్ పెళ్లి అయిపాయే- స్వప్నది దొంగ కడుపని తెలుసుకున్న రాజ్, కావ్య పరిస్థితి ఏంటి?
స్వప్న, రాహుల్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
స్వప్న ఇంకా రాకపోవడంతో రుద్రాణి కనకం వాళ్ళని తిడుతుంది. ముహూర్తానికి ఇంక ఎంత టైమ్ ఉందని రుద్రాణి పంతుల్ని అడిగితే ముహూర్తం దాటిపోయి ఐదు నిమిషాలు అయ్యిందని చెప్తాడు. ఈ పెళ్లి ఆపేద్దామని రుద్రాణి అంటుంటే పెళ్లి జరిగి తీరుతుందని రాజ్ వాళ్ళు స్వప్నని తీసుకుని ఎంట్రీ ఇస్తారు. తనని చూసి రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. ఏమైంది ఎక్కడికి వెళ్లిపోయావని కనకం అడుగుతుంది. ఈ పెళ్లికి వెయిటర్ వేషంలో వచ్చిన వెధవలు అక్కని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని కావ్య చెప్తుంది. రాజ్ ఎందుకు కిడ్నాప్ చేశాడో కనుక్కున్నావా అని ఏమి తెలియనట్టు రాహుల్ అడుగుతాడు. స్వప్నని పెళ్లి చేసుకోవాలని అనిపించి కిడ్నాప్ చేసినట్టు రాజ్ చెప్పడంతో రాహుల్ ఊపిరి పీల్చుకుంటాడు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏం లాభం ముహూర్తం దాటిపోయిందని రుద్రాణి అంటుంది. ఆ విషయంలో నువ్వేమి కంగారు పడకు మళ్ళీ ముహూర్తం ఎప్పుడుందని అపర్ణ అడుగుతుంది.
Also Read: యష్, వేదని చూసి అసూయతో రగిలిపోతున్న మాళవిక- అభిమన్యు ఏం చేయబోతున్నాడు?
మరికాసేపటిలో ఉందని చెప్పేసరికి తమ ప్లాన్ ఫెయిల్ అయినందుకు రుద్రాణి రగిలిపోతుంది. స్వప్న చేతికి గాయం అయితే దానికి మందు రాస్తుంది కావ్య. భద్రాచలం నుంచి సీతారాముల తలంబ్రాలు తెప్పించానని అవి స్వప్న బ్యాగ్ లో ఉన్నాయని చెప్పి తీసుకురమ్మని చెప్తుంది. కావ్య వాటిని తీసుకురావడానికి వెళ్ళగా స్వప్నని పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. వాటిని తీస్తూ ఉండగా స్వప్న ఫోన్ రింగ్ అవుతుంది. అరుణ్ ఫోన్ కావ్య లిఫ్ట్ చేస్తుంది. హాయ్ స్వప్న ఈ పాటికి నీకు పెళ్లి అయిపోయి ఉంటుంది. కంగ్రాట్స్ నేను నిన్ను ప్రేమించినా రాహుల్ ని ఇష్టపడ్డావని నా ప్రేమని త్యాగం చేశాను. రాహుల్ తో నీ పెళ్లి జరగాలని నువ్వు కోరుకున్నట్టే ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను కానీ ఆ నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేవు నెలలు పెరిగే కొద్ది కడుపు పెరగకపోతే అనుమానం వస్తుంది. వీలైతే ఆ అబద్దాన్ని నిజం చేసుకో అల్ ది బెస్ట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అక్క ప్రెగ్నెంట్ కాదా మళ్ళీ పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. దాని తరఫున నేనే ఎక్కువ గొడవ చేశాను తన కడుపు అబద్ధం అని తేలితే రాజ్ మా కుటుంబాన్ని అసహ్యించుకుంటాడు. అది అడ్డం పెట్టుకుని రాహుల్ వదిలేసినా ఎవరూ సపోర్ట్ చేయరు. వెంటనే ఈ విషయం చెప్పి ఎలాగైనా పెళ్లి జరిపించాలని అనుకుంటుంది.
Also Read: ఏడేడు జన్మలకి కృష్ణ తన భార్యగా రావాలన్న మురారీ- ముక్కలైన ముకుంద మనసు
సరిగ్గా కావ్య వచ్చే టైమ్ కి రాహుల్ స్వప్న మెడలో తాళి కట్టేస్తాడు. ఈవిడ ఇప్పుడే ఇంత కోపంగా ఉంది అక్క కడుపు అబద్ధమని తెలిస్తే తాళి తెంచేసి బయటకి గెంటేస్తుందని కావ్య భయపడుతుంది. ఎంత పెద్ద తప్పు చేశావక్కా గొప్ప ఇంటి కోడలు కావాలని ఆశపడి సుడిగుండంలోకి తోసేసుకున్నావ్. ఈ నిజం తెలిస్తే మన ఇద్దరి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉందని అనుకుంటుంది. స్వప్నని రుద్రాణి ఎప్పటికీ కోడలిగా అంగీకరించనని చెప్తుంది. కనకం స్వప్న చేతిని రుద్రాణి చేతిలో పెట్టి మీరు కోరుకున్న స్థాయి మాకు లేదు కానీ ఇద్దరు మన చేతిలో ఏమి లేకుండా చేశారు. ఏం జరిగినా అది నిన్నటితోనే పాత పడింది. ఇవాల్టి నుంచి నా కూతురు మీ కూతురు అయ్యింది ఏవైనా పొరపాట్లు చేస్తే క్షమించమని ఎమోషనల్ గా అడుగుతుంది. జాగ్రత్తగా మర్యాదగా సంస్కారంతో ప్రవర్తించమని కృష్ణమూర్తి చక్కగా చెప్తాడు. స్వప్న దుగ్గిరాల ఇంటి సభ్యురాలు అయ్యిందని దిగులు పడాల్సిన పని లేదని ఇంద్రాదేవి ధైర్యం చెప్తుంది.