Ennenno Janmalabandham June 16th: యష్, వేదని చూసి అసూయతో రగిలిపోతున్న మాళవిక- అభిమన్యు ఏం చేయబోతున్నాడు?
మాళవికని తీసుకొచ్చి వేద ఇంట్లో పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ భార్య మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తాడు. నేను మన బంధానికి విలువ ఇవ్వనప్పుడు కూడా నువ్వు బాధ్యతలు వదల్లేదు. ఇది నీ గొప్పతనం కోపం చూపించినంత సులువు కాదు ప్రేమని చూపించడమని అంటాడు. అప్పుడే మాళవిక వాళ్ళ గదికి వస్తుంది. పెళ్లి రోజు ఏ ప్రమాణాలు చేయలేదు ఇప్పుడు చేస్తున్నా నిన్ను జీవితాంతం సంతోషంగా ఉంచుతాను నీ కళ్ళలో ఎప్పటికీ కన్నీళ్ళు రానివ్వను, ఎలాంటి పరిస్థితులైన సరే నీతో పాటు అడుగులో అడుగు వేస్తాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు నీకు తోడుగా నీడగా ఉంటాను. ఈరోజు నుంచి నీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తే అవి ఆనంద భాష్పాలు అవుతాయని అనగానే వేద కౌగలించుకుంటుంది. నువ్వు రానంత వరకు నా జీవితం ఒక నరకంలాగా ఉండేది నీతో కలిసి బతకడం మొదలుపెట్టాకే తెలుస్తుంది అది స్వర్గమని ఎన్నో జన్మల పుణ్యం ఈ జన్మలో మన బంధం ఇది నా అదృష్టమని చెప్తాడు.
Also Read: ఏడేడు జన్మలకి కృష్ణ తన భార్యగా రావాలన్న మురారీ- ముక్కలైన ముకుంద మనసు
ఇంత ప్రేమని పంచే మీరు భర్తగా దొరకడం తన అదృష్టమని వేద పొంగిపోతుంది. వాళ్ళని అలా చూసి మాళవిక కోపంతో డోర్ కొడుతుంది. పర్మిషన్ లేకుండా బెడ్ రూమ్ లోకి వచ్చేయడమేనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా అని యష్ కోపంగా అంటాడు. ఏం అవసరం ఉండి వచ్చిందేమో అని వేద తన వెనుకాలే వెళ్తుంది. ఏం పని మీద వచ్చావని అడుగుతుంది. ఆదిత్యకి టై కట్టాలి యష్ ని అడుగుదామని వచ్చినట్టు చెప్తుంది. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు ఈసారి మా రూమ్ లోకి వచ్చేతప్పుడు డోర్ నాక్ చేసి రా ఇబ్బందిగా ఉంటుందని వేద చెప్పేసి వెళ్ళిపోతుంది. నా స్థానంలోకి వచ్చిన నువ్వు నాకే సలహాలు ఇస్తున్నావా పరాయి దాన్ని చేసి మాట్లాడతావా అని మాళవిక రగిలిపోతుంది. అభి చేతికి గాయం చూసి నీలాంబరి బాధపడుతుంది. ఖైలాష్ వచ్చి ఏమైందని అడిగితే నీలాంబరి నాలుగు చీవాట్లు పెడుతుంది.
Also Read: పంతులు తెలివి అదుర్స్, తెలివి చూపించిన రాజ్- రాహుల్, రుద్రాణి షాక్
ఖుషి బర్త్ డే సెలెబ్రేషన్స్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారని ఖైలాష్ చెప్తాడు. అయితే దానికి మనం కూడా వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టాలని అభి అంటాడు. వేద యష్ పిల్లల్ని తీసుకుని ఫంక్షన్ కి వస్తారు. వాళ్ళని చూసి సులోచన, మాలిని మురిసిపోతారు. జోకర్ వేషాలు వేసుకుని అభి, ఖైలాష్ వస్తారు. ఈ ఫంక్షన్ లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు మనం చేయాల్సిన డ్యామేజ్ చేయాలి. మనం చేసిన పని యష్ వాళ్ళకి షాక్ కొట్టాలని చెప్తాడు. ఖుషి, ఆదిత్య పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండగా అభిమన్యు వాళ్ళు వస్తారు. వీళ్ళు జోకర్లు కాదు ఎవరో నేను చెప్పనా అని ఆదిత్య అనేసరికి ఖైలాష్ టెన్షన్ పడతాడు. మీరు అసలైన జోకర్స్ కాదు ఎలియన్స్ మీరు మాకోసం ఏం తెచ్చారని అడుగుతాడు.