Brahmamudi July 8th: కావ్య మీద బెట్టుతో కూడిన ప్రేమ చూపించిన రాజ్- అప్పుని విడిపించిన కళ్యాణ్
కావ్య పట్ల రాజ్ తన మనసు మార్చుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తన కొడుక్కి ఈ పరిస్థితికి రావడానికి నువ్వే కారణమంటూ అపర్ణ కోడలి మీద విరుచుకుపడుతుంది. ఇక రాజ్ వచ్చి కళావతి తప్పేమీ లేదని వద్దన్నా వినకుండా ఐస్ క్రీమ్ తినేసరికి ఇలా జరిగిందని చెప్తాడు. సమయానికి తనే చాలా కష్టపడి సెక్యూరిటీ స్కూటీ మీద హాస్పిటల్ కి తీసుకెళ్లింది. తను తీసుకెళ్లకపోతే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేదని చెప్తాడు. రాత్రంతా నువ్వు మేల్కొని ఉన్నావ్ వెళ్ళి పడుకోమని కావ్యని పంపించేస్తాడు. విన్నావా తొందరపడి నోరు జారీ ఒక మాట అన్నావ్ ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించమని శుభాష్ అంటాడు. ఇక నుంచైనా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడమని ఇంద్రాదేవి అపర్ణని తిడుతుంది. సాయం కోసం సీతారామయ్య ఇంటికి వచ్చి కావ్యని మాటలు అనడం వినేసి గుమ్మంలో నుంచి వెనుదిరుగుతారు.
Also Read: గీతిక ముందు తన ప్రేమని బయటపెట్టిన కృష్ణ- ముకుందకి ఇంకొక పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన భవానీ
తను ఆడిన అబద్ధం వల్ల నిజానికి కూడా విలువ లేకుండా పోతుందని అనడానికి తన కూతురి జీవితమే సాక్ష్యమని కనకం బాధపడుతుంది. ఇప్పటికే ఇద్దరి కూతుళ్ల గురించి నీచంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మురదో కూతురు జైలుకి వెళ్తుందని తెలిస్తే మన కుటుంబాన్ని వెలివేస్తారని కనకం కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇప్పుడు అప్పుని కాపాడుకోవడం ఎలా అంటుంది. కళ్యాణ్ అప్పుకి కాల్ చేస్తాడు కానీ ఆఫ్ అని రావడంతో డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుని ఇంటికి వెళతాడు. కళ్యాణ్ ఇంటికి వచ్చి అప్పుని పిలుస్తాడు. నిజం తెలిస్తే ఇంట్లో చెప్పేస్తాడేమో అనుకుని అప్పు గురించి అబద్దం చెప్తుంది. కానీ ఆమె చెప్పింది అబద్దమని అర్థం చేసుకుంటాడు. కావ్య ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. అది చూసి ధాన్యలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి వాళ్ళ మాటలు వింటాడు.
రాజ్ ని కాపాడిన నీకు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి కానీ మాటలని బాధపెట్టారు. మీ అత్తయ్య అన్ని మాటలు అనేసరికి కన్నీళ్ళతో బాధపడుతున్నావని అంటుంది. నేను ఏడవడం ఏంటి ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళు వచ్చాయని చెప్తుంది. నిజం చెప్పు కావ్య మీ అత్తయ్య తిట్టిందని బాధగా లేదా అని అడుగుతుంది. బాధ ఎందుకు కొడుక్కి ఏమవుతుందోనని అరిచారు కానీ ఆయన వచ్చి నిజం చెప్పగానే ఒక్క మాట కూడా అనలేదని అంటుంది. చాలా బాగా అర్థం చేసుకున్నావని మెచ్చుకుంటుంది. కనకం వాళ్ళు ఎస్సై దగ్గరకి వచ్చి ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని విడిచిపెట్టమని బతిమలాడుతుంది. మీనాక్షి వచ్చి వాగుతూ ఉంటే ఎస్సై పారిపోతుంటే కళ్యాణ్ లాయర్ ని తీసుకుని వస్తాడు. కంప్లైంట్ ఇచ్చిన వాడు విత్ డ్రా చేసుకుంటే కేసు ఉండదు కదా అని రాకేష్ ని పిలుస్తాడు. కేసు విత్ డ్రా చేసుకుంటానని రాకేష్ చెప్తాడు. వెంటనే అప్పుని రిలీజ్ చేస్తారు.
Also Read: మాళవిక తొలి విజయం- హాల్లోకి చేరిన యష్ పెళ్లి ఫోటో, మౌనంగా చూస్తూ ఉండిపోయిన వేద
సమయానికి వచ్చి కూతురి జీవితాన్ని కాపాడినందుకు కనకం కళ్యాణ్ కి చేతులెత్తి దణ్ణం పెడుతుంది. ఇది తన బాధ్యతని కావ్య వదిన ఫ్యామిలీకి కష్టమంటే నాకు కష్టమేనని చెప్తాడు. అపర్ణ డల్ గా కూర్చుంటే శుభాష్ వచ్చి ఏమైందని అడుగుతాడు. కావ్య విషయంలో తప్పు చేశావని అంటాడు. ఆ అమ్మాయి మంచిది కాబట్టి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. అన్న మాటలు ఎలాగూ వెనక్కి తీసుకోలేవు కనీసం తనకి సోరి అయినా చెప్పమని చెప్తాడు. శుభాష్ ఎన్ని చెప్పినా కూడా వెళ్ళి సోరి చెప్పడం కుదరదని అంటుంది. సరే సోరి వద్దు థాంక్స్ చెప్పు అది నీ బాధ్యతని అపర్ణని బలవంతంగా కావ్య దగ్గరకి తీసుకుని వెళతాడు. మీ అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంట అని ఇరికిస్తాడు. అతి కష్టం మీద అపర్ణ కోడలికి థాంక్స్ చెప్తుంది. ఆ మాటకి కావ్య షాక్ అవుతుంది. నా కొడుక్కి ఏమి కాకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లావ్ కదా అందుకే థాంక్స్ చెప్పానని అనేసి ఎప్పటికీ కోడలిగా అంగీకరించనని అంటుంది. హద్దుల్లో ఉంటే మంచిదని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అపర్ణ తరఫున కోడలికి శుభాష్ సోరి చెప్తాడు.
హాస్పిటల్ లో డబ్బులు కోసం కావ్య పడిన ఇబ్బంది గురించి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. తనకంటూ ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదా? డబ్బు లేకుండా ఎలా బతుకుతుంది. తన పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నా. తనని భార్యగా చూడకపోయినా పరవాలేదు కనీసం మనిషిగా అయినా చూడాలి. కళావతి దగ్గర డబ్బు ఉండాలని అనుకుంటాడు. వెంటనే కొంత డబ్బు తీసి తనకి ఇవ్వాలని అనుకుంటాడు. ఎలా ఇవ్వాలి ఏం చెప్పి ఇవ్వాలని ఆలోచిస్తాడు. అన్నీ హక్కులు కావాలని అంటుంది కానీ ఆర్థిక స్వతంత్రం కావాలని అడగదు ఏంటని ఎంతైనా ఇది తింగరి బుచ్చి అనుకుంటాడు.