Ennenno Janmalabandham July 7th: మాళవిక తొలి విజయం- హాల్లోకి చేరిన యష్ పెళ్లి ఫోటో, మౌనంగా చూస్తూ ఉండిపోయిన వేద
మాళవిక నిజస్వరూపం గురించి వేదకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మాళవిక కొడుకు మనసులో విషం నింపడం వేద విని షాక్ అవుతుంది. మా అమ్మ చెప్పింది నువ్వు పాముకి పాలు పోస్తున్నావని. ఇక సానుభూతి సామరస్యం పనికిరావు. సమరం తప్పదు. నీలాంటి దానికి బుద్ధి చెప్పాలి ఆ టైమ్ వచ్చిందని వేద అనుకుంటుంది. ఆదిత్య బాల్ ఆట ఆడుకుంటూ ఉండగా బాల్ స్టోర్ రూమ్ లో పడిపోతుంది. దాన్ని తీసుకోవడానికి వెళ్ళిన ఆదిత్యకి యష్, మాళవిక పెళ్లి ఫోటో కనిపిస్తుంది. ఇదేంటి ఇక్కడ పడేశారు అమ్మకి చూపించాలని తీసుకెళ్ళి చూపిస్తాడు. ఇది మీ పెళ్లి పహవతి కదా స్టోర్ రూమ్ లో ఎందుకు పడేశారని అడుగుతాడు. ఇంతకముందు ఇంట్లోనే ఉండేది కానీ వేద ఆంటీ వచ్చింది కదా అందుకే తీసి పడేసి ఉంటారు. ప్రతి దానికి వేద ఆంటీ మంచిదని చెప్తావ్ కదా ఇప్పుడు చూడు ఎలా చేసిందోనని ఎక్కిస్తుంది. దీంతో ఆదిత్య కోపంగా ఈ ఫోటో తన గదిలో పెట్టుకుంటానని చెప్తాడు. నీ గదిలో పెట్టుకుంటే నీకు మాత్రమే తెలుస్తుంది.. అదే అందరికీ కనిపించేలా పెడితే బాగుంటుందని ఐడియా ఇస్తుంది. దీంతో ఆదిత్య ఆ ఫోటో హాల్లో పెడతానని తీసుకెళ్తాడు.
Also Read: తాగేసి రచ్చ రచ్చ చేసిన మురారీ- డైరీ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు గీతికని కలిసిన కృష్ణ
కొడుకు చేసిన పనికి తన కడుపు నిండిపోయిందని సంబరపడుతుంది. తన మీద జాలి పడి ఇంట్లోకి తెచ్చినందుకు నన్నే బయటకి పంపాలని అవుతుందా తనని ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. యష్ పిలిచినా కూడా పట్టించుకోకుండా ఉండేసరికి మళ్ళీ ఏమైందని అనుకుని తన మూడ్ మార్చేందుకు ట్రై చేస్తాడు. కిచెన్ లో రొమాన్స్ మొదలు పెట్టేస్తాడు. వేద డల్ గా ఉండేసరికి జాంబీలా ఉన్నావని అనేసరికి చపాతీల కర్ర పట్టుకుని వెంట పడుతుంది. మాలిని వచ్చి ఏమైంది వీడు నాకు ఎటూ నిజం చెప్పడు నా పేరు చెప్పి మరో రెండు తగిలించమని చెప్తుంది. ఇంట్లో మగాళ్లకి రక్షణ లేకుండా పోయింది మేము మీ ఆడవాళ్ళ మీద గృహహింస కేసు పెడతానని అంటాడు. ఇంట్లో ఒక జాంబీ మాత్రమే అనుకున్నా కానీ ఇద్దరు ఉన్నారని అనేసరికి మాలిని చపాతీ కర్ర పట్టుకుని వెంట పడుతుంది. అప్పుడే యష్ మాళవికల పెళ్లి ఫోటో చూస్తాడు.
మాళవిక అని గట్టిగా అరుస్తాడు. ఏంటి ఇదని అడుగుతాడు. ఈ ఫోటో ఇక్కడ ఎందుకు ఇక్కడ పెట్టావ్? ఉఏ, ఆశించి పెట్టావు. కొన్ని బంధాలు వదులుకున్నాక వాటిని పట్టుకుని వేలాడటం అనవసరం. ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండటం ఎందుకని గొడవలు పెట్టడం కోసం చేశావా అని నిలదీస్తుంది. ఎందుకు చేశావ్ నువ్వు వదిలేసిన చోటు మళ్ళీ దక్కించుకుందామని చేశావా అని మాలిని ప్రశ్నిస్తుంది. అందరూ తల ఒక మాట అంటే ఆదిత్య వచ్చి వినాలి అప్పుడు ఉంటుందని మాళవిక సైలెంట్ గా ఉంటుంది. ఏ చేతులతో పెట్టావో అదే చేతులతో తిరిగి తీసేయమని చెప్తాడు. ఆదిత్య వచ్చి ఆ ఫోటో పెట్టింది తనేనని అంటాడు. అది మా అమ్మానాన్నల పెళ్లి ఫోటో ఎవరో దీన్ని స్టోర్ రూమ్ లో పడేశారు వాళ్ళ పెళ్లి ఫోటో ఎందుకు అక్కడ ఉండాలని ఇక్కడ పెట్టానని చెప్తాడు. వేద ఏం మాట్లాడొద్దని యష్ కి సైగ చేస్తుంది. దీంతో మౌనంగా వెళ్ళిపోతాడు.
Also Read: భర్తని చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన కావ్య- కోడలిని అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టు తిట్టిన అపర్ణ
ఇదంతా ఆదిత్యని అడ్డం పెట్టుకుని నువ్వు చేస్తున్న కుట్ర ఇదని అర్థమవుతుంది. నిన్ను తెచ్చిపెట్టినందుకు నాకు కరెక్ట్ గానే సమాధానం ఇవ్వాలని చూస్తున్నవని వేద మనసులో అనుకుంటుంది. ముందు ఆదిత్య మనసు మార్చి తను చేస్తుంది తప్పని అర్థంఅయ్యేలా చేయాలని డిసైడ్ అవుతుంది. ఆ ఫోటో చూసి నేనే డిస్ట్రబ్ గా ఫీల్ అయ్యాను అంటే వేద ఎంత డిస్ట్రబ్ అయ్యిందోనని యష్ బాధపడతాడు.