By: ABP Desam | Updated at : 22 Oct 2021 12:31 PM (IST)
(Image credit: Starmaa)
నిత్యం గొడవలు, అరుచుకోవడాలు, ఛాలెంజ్ లు, రెచ్చగొట్టడాలు... ఇవే కదా బిగ్ బాస్ ప్రోమోలో కనిపించేవి. కానీ ఈసారి భిన్నం. హౌస్ ప్రశాంతంగా ఉంది. గంభీరవాతావరణంలో గుండె బరువెక్కే జ్జాపకాలతో నిండిపోయింది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను తమ మరపురాని జీవితానుభావాలను చిరునవ్వుతో పంచుకోమని అడిగినట్టున్నారు. అందుకే ఇంటి సభ్యులంతా తమ కష్టాలు, కన్నీళ్లు తోటి సభ్యులతో షేర్ చేసుకుంటూ కనిపించారు.
ముఖ్యంగా సిరి తన అనుభవాలను పంచుకుని అందరినీ ఏడిపించేసింది. ‘అందరూ అన్నారు ఊళ్లో... తల్లి ఏమైనా పద్దతిగా ఉందా కూతురు ఉండడానికి అన్నారు... మా ఊళ్లో వాళ్లకి, మా చుట్టాలకి నేను చెబుతున్నదేంటంటే నేను పద్దతిగానే పెరిగాను, పద్దతిగానే ఉంటున్నాను’ అంటూ గుండెలు పిండేసింది. జెస్సీ మాట్లాడుతూ తనకు చిన్నప్పట్నించి గొంతు సమస్య ఉందని, తనకు వాయిస్ సరిగా రాదని చెప్పుకొచ్చాడు. అయినా తానూ గిన్నిస్ బుక్ ఎక్కానని, ఫ్యాషన్ ఐకాన్ గా మారానని, తన తల్లి మాత్రం తన కొడుకు మోడల్ అని చెప్పుకోదని అన్నారు. ఇక సన్నీ తన తల్లి గురించి చెబుతూ ముగ్గురు అబ్బాయిలను ఒంటరిగా ఒక మహిళ పెంచడం ఎంత కష్టమో తనకు తెలుసునని ఎమోషనల్ అయ్యాడు.
ఇక ఇంట్లో గత రెండు రోజులుగా రచ్చరచ్చ చేసిన ప్రియా తన అనుభవాలను కూల్ గా పంచుకున్నారు. పెళ్లి తరువాత తాను సినిమాలు చేయడం మానేశానని, ఏడాదికే బాబు పుట్టాడని, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని చెప్పుకొచ్చారు. లోబో కూడా తెలుగు రాష్ట్రాల్లో తనకు మంచి గుర్తింపు వచ్చినట్టు తెలిపారు. మొత్తమ్మీద ఈ రోజు హౌస్ కూల్ గా, ఎమోషనల్ గా సాగేట్టు కనిపిస్తోంది.
Let's share memories with a smile 😀 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/zkhJtHi3Kt
— starmaa (@StarMaa) October 22, 2021
">
Also read: సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి రైస్‌తో బరువు తగ్గే ఛాన్స్... నిజమేనా?
Also read: అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు
Also read: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి
Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!
Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
TSPSC: నేడే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!