By: ABP Desam | Updated at : 07 Dec 2021 04:59 PM (IST)
షణ్ముఖ్ ఇక రియలైజ్ అవ్వడా..? సిరిని వదలడా..?
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షణ్ముఖ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అతడి వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే తన యాటిట్యూడ్, గేమ్ ప్లేతో గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్. మొదటి మూడ్నాలుగు వారాలు అతడు గేమ్ ఆడకపోయినా.. తన బిహేవియర్ తో ఆకట్టుకున్నాడు. హౌస్ లో రవి వేసే స్ట్రాటజీలను ముందే ఆలోచించి దానికి తగ్గట్లుగా గేమ్ ఆడేవాడు.
హౌస్ లో అందరినీ బాగా గమనించడంతో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో షణ్ముఖ్ కి బాగా తెలిసింది. వారికి తగ్గట్లుగా గేమ్ ప్లాన్ మార్చుకునేవాడు. అందుకే అందరూ కలిసి అతడికి 'బ్రహ్మ' అని బిరుదు కూడా ఇచ్చారు. జెస్సీ-సిరిలతో కలిసి టీమ్ గా ఆడేవాడు షణ్ముఖ్. ఆ తరువాత జెస్సీ వెళ్లిపోవడంతో కాస్త డల్ అయ్యాడు షణ్ముఖ్. కానీ తన గేమ్ ని పక్కన పెట్టలేదు. అందుకే అతడు ఎన్నిసార్లు నామినేషన్ లో ఉన్నా.. జనాలు సేవ్ చేస్తూ వచ్చారు.
కానీ ఈ మధ్యకాలంలో అతడి బిహేవియర్ కాస్త విసుగు తెప్పిస్తుంది. సిరితో హగ్ లు ఎక్కువయ్యాయని ఆమె తల్లి డైరెక్ట్ గా హౌస్ లోకి వచ్చి చెప్పింది. దీంతో సిరిని దూరం పెడతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. హగ్ చేసుకునే ప్రతీసారి 'ఫ్రెండ్షిప్ హగ్' అని చెప్పి చెప్పి ఆడియన్స్ ను విసిగిస్తున్నారు. ఇక సిరిని షణ్ముఖ్ ఏ రేంజ్ లో మానిప్యులేట్ చేస్తున్నాడంటే.. బిగ్ బాస్ ట్రోఫీ తనకు అక్కర్లేదని.. షణ్ముఖ్ కి వస్తే చాలని చెప్పేవరకు వెళ్లింది.
సిరి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ షణ్ముఖ్ తో స్నేహం చేసి.. కనీసం తన ఒపీనియన్ కూడా బయటకు చెప్పలేని పరిస్థితికి వచ్చింది. ఏదున్నా.. మొహం మీద మాట్లాడే సిరి.. షణ్ముఖ్ పక్కనే ఉండడంతో 'ఏం మాట్లాడితే ఏం అంటాడో అని' సైలెంట్ గా ఉండిపోతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా కాజల్, మానస్ కలిసి సరదాగా సిరి-సన్నీలను ఏడిపించారు. సన్నీకి సిరితో లింక్ పెడుతూ రెండు, మూడు కామెంట్స్ వేశారు. ఆ సంభాషణ సరదాగానే సాగింది. సిరి కూడా కౌంటర్లు వేస్తూ కాస్త ఎంజాయ్ చేసింది. అప్పటివరకు పడుకొని ఈ కాన్వర్సేషన్ విన్న షణ్ముఖ్ నిద్రలేచి మరీ సిరికి క్లాస్ పీకాడు. నీ క్యారెక్టర్ బ్యాడ్ గా బయటకు వెళ్తాదని.. నీకు ఆలోచించే బుర్ర లేదని ఆమెని తక్కువ చేసి మాట్లాడాడు.
చాలా వారాలుగా నీకు సపోర్ట్ చేస్తూ వచ్చానని డైలాగ్స్ కొడుతూ.. తన కారణంగానే సిరి హౌస్ లో ఉందన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. సిరిని పదే పదే బ్రెయిన్ వాష్ చేయడంతో షణ్ముఖ్ ఏది చెప్తే అది చేస్తూ.. గేమ్ ఆడుతుంది సిరి. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా షణ్ముఖ్ క్రేజ్ తగ్గిపోతుంది. మూడు వారాల క్రితం వరకు అతడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడని భావించిన చాలా మంది ఇప్పుడు అతడికి రెండు, మూడు స్థానాలను కూడా ఇవ్వాలనుకోవడం లేదు. షణ్ముఖ్ రియలైజ్ అవ్వడానికి టైం కూడా దాటిపోయింది. ఫైనల్స్ లో షణ్ముఖ్ కి ఏ ప్లేస్ దక్కుతుందో చూడాలి!
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌చేయండి
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!