By: ABP Desam | Updated at : 22 Nov 2021 07:07 PM (IST)
సన్నీని రెచ్చగొట్టిన శ్రీరామ్..
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. నామినేషన్స్ కావడంతో కంటెస్టెంట్స్ మధ్య హీట్ డిస్కషన్స్ జరిగాయి. 'ఇక నుంచి నువ్ మారితే బెటర్ పెర్సన్ అవుతావు' అని సన్నీకి రవి చెప్పగా.. 'నువ్ మారమంటే నేను మారితే అది నేను కాదు మామ' అంటూ రిప్లై ఇచ్చాడు. 'నేను కెప్టెన్ గా చేసినప్పుడు సంచాలక్ గా బెటర్ చేశాననిపించింది' అని రవికి రీజన్ చెప్పాడు షణ్ముఖ్. దానికి రవి 'కంపారిజన్స్ అంటే.. గేమ్ నీకంటే అందరూ బాగా ఆడుతున్నారు' అంటూ కౌంటర్ వేశాడు.
Also Read: బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ రోల్ అదే... ప్రిపేర్ అయ్యే టైమ్ కూడా లేదట!
శ్రీరామ్.. కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'ఒకర్ని సేవ్ చేసే ఆప్షన్ ఉన్నప్పుడు నువ్ ఇద్దరినీ డిస్ట్రాయ్ చేయడం నాకు నచ్చలేదు' అని రీజన్ చెప్పగా.. 'నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు నాకు నచ్చినట్లు నేను గేమ్ ఆడతాను' అని బదులిచ్చింది కాజల్. 'నువ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు వాల్యూస్ కూడా మర్చిపోతావ్' అని డైలాగ్ వేశాడు శ్రీరామ్. దానికి కాజల్ సీరియస్ అయింది. 'నువ్ సర్వం అగ్ని' అంటూ కౌంటర్ వేశాడు శ్రీరామ్.
'ఏదో ఒక పర్సన్ ని బ్లేమ్ చేయడానికి ముందుంటావ్ కానీ మంచి చెప్పడానికి వెనక ఉంటావ్' అంటూ రవిని ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు సన్నీ. 'తప్పు చేస్తే మొహం మీదే చెప్తా' అంటూ రవి వేలు చూపించి మాట్లాడాడు. వెంటనే సన్నీ 'వేలు దింపు' అని అడగ్గా.. 'నువ్ చూపీరా' అంటూ రెచ్చగొట్టాడు రవి. 'మోస్ట్ ఫేక్ పర్సన్ అంటే నువ్వే మచ్చా' అంటూ రవికి డైలాగ్ వేశాడు సన్నీ.
ఆ తరువాత సన్నీ-శ్రీరామ్ లకు కూడా గొడవ జరిగింది. 'మొహం చూసి మాట్లాడు.. అటు ఇటు చూసి కాదు' అని శ్రీరామ్ అనగా.. 'మజాక్ లు ఆడుకుంటూ.. మొహం మీద మాస్క్ లు వేసుకొని' అని సన్నీ డైలాగ్ వేయగా.. 'ఛల్ ఛల్.. గ్రూప్ లాడుకుంటూ.. నువ్వేం మాట్లాడతావ్' అంటూ సన్నీని రెచ్చగొట్టేలా శ్రీరామ్ మాట్లాడగా.. 'నేనిలానే ఉన్నా.. ఒరిజినల్' అంటూ సినిమాటిక్ గా చెప్పాడు సన్నీ. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. మధ్యలో మానస్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు.
Nominations heat between #Sunny & #SreeramaChandra 🔥 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/E9VwCMuDIy
— starmaa (@StarMaa) November 22, 2021
Also Read: హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ... తెలుగులో ఓ సినిమా, మాతృభాషలో మరో రెండు!
Also Read: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..
Also Read: మార్వెల్ స్టూడియోస్... మీకు తెలియదు! మా 'హల్క్'ను మేమే క్రియేట్ చేసుకున్నాం! - జాన్ అబ్రహం
Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!
Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!
Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్
Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ శోభా హేటర్స్‌కు గుడ్ న్యూస్ - అదేంటో తెలుసుకోవాలని ఉందా?
Shobha Shetty: శోభా, ఏమిటి మాకీ క్షోభ - ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారంటూ చర్చ, ఈ వారమైనా వెళ్తుందా?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>