అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: శ్రీరామ్ కి క్లోజ్ అవుతున్నారా..? అయితే జాగ్రత్త..
ప్రతీవారం శ్రీరామచంద్ర సేవ్ అయిపోతున్నాడు కానీ అతడి చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తున్నారు.
బుల్లితెరపై ఓ సింగింగ్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీరామచంద్ర ఆ తరువాత సింగర్ గా ఎన్నో సినిమాల్లో పాడాడు. తన వాయిస్ తో ఇండియన్ ఐడల్ కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ అందుకోవాలని సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఎన్నిసార్లు శ్రీరామచంద్ర నామినేషన్ లో ఉన్నా.. ఆడియన్స్ సేవ్ చేస్తూ వస్తున్నాయి. ఈ వారం కూడా అతడి నామినేషన్ లో ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ లో సేవ్ అయినట్లు చెప్పారు.
శ్రీరామచంద్ర సేవ్ అయిపోతున్నాడు కానీ అతడి చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తున్నారు. ముందుగా హమీదతో శ్రీరామ్ చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఆమెకి సలహాలు ఇస్తూ.. బాధలో ఉంటే ఓదారుస్తూ.. ఆమెకి మసాజ్ చేస్తూ.. అబ్బో ఇలా చాలానే చేసేవాడు. బిగ్ బాస్ వీరిద్దరికీ ఓ లవ్ ట్రాక్ కూడా నడిపించారు. కానీ ఇంతలోనే హమీద ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఆమె వచ్చేసిన రెండు, మూడు వారాల వరకు శ్రీరామ్ ఎవరితో సరిగ్గా ఉండేవాడు కాదు. సోలోగానే గేమ్ ఆదుకున్నాడు.
ఆ తరువాత మెల్లగా విశ్వ, యానీ మాస్టర్, రవిలకు క్లోజ్ అయ్యాడు. విశ్వతో బాగా స్నేహంగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి కొన్ని టాస్క్ లు కూడా ఆడారు. కానీ ఊహించని విధంగా విశ్వ బయటకు వచ్చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన విశ్వ ఎలిమినేట్ అవ్వడాన్ని హౌస్ మేట్స్ జీర్ణించుకోలేకపోయారు. ఆ తరువాత యానీ మాస్టర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు శ్రీరామచంద్ర. ఆమె నామినేషన్ లో ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాడు. ఆమెకోసమే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గేమ్ ఆడాడు. కానీ ఆ పాస్ సన్నీకి దక్కింది.
ఆ సమయంలో శ్రీరామ్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. యానీ సరిగ్గా గేమ్ ఆడలేదని 'ఈ వారం ఎలిమినేట్ అయిపోతే అప్పుడు తెలుస్తాది మీకు' అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు. శ్రీరామ్ ఊహించిన విధంగానే యానీ మాస్టర్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. దీంతో శ్రీరామ్ బాగా అప్సెట్ అయ్యాడు. ఇంట్లోకి తన సిస్టర్ వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పి బాధపడ్డాడు. తను ఎవరికి క్లోజ్ అవుతున్నా.. ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోతున్నారని అన్నాడు.
ఇప్పుడు రవి వంతు వచ్చినట్లు ఉంది. రెండు వారాలుగా రవి-శ్రీరామ్ కలిసి ఆడుతున్నారు. రవికి బాగా క్లోజ్ అయిపోయాడు శ్రీరామచంద్ర. ఇంతలో ఇప్పుడు రవి ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు అతడి ఎలిమినేషన్ ఖాయమని తెలుస్తోంది. రవి గనుక వెళ్లిపోతే శ్రీరామ్ హౌస్ లో ఒంటరి వాడైపోతాడు. మానస్-సన్నీ-కాజల్-ప్రియాంక ఒక గ్రూప్, సిరి-షణ్ముఖ్ ఒక గ్రూప్. మరి శ్రీరామ్ సోలోగా ఆడుకుంటాడో.. లేక ఏదైనా గ్రూప్ లో జాయిన్ అవుతాడో చూడాలి!
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తిరుపతి
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion