అన్వేషించండి
Advertisement
Deepthi Sunaina: బిగ్ బాస్ వైరల్ వీడియోపై దీప్తి సునయన వైల్డ్ రియాక్షన్..
నిన్న బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన దీప్తి సునయన.. షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు పన్నెండు వారాలను పూర్తి చేసుకోబోతుంది. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో షణ్ముఖ్ ఒకడు. రెండు రోజులుగా హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించిన బిగ్ బాస్.. నిన్న ఎపిసోడ్ లో రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ను స్టేజ్ పైకి తీసుకొచ్చారు. షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన కూడా స్టేజ్ పైకి వచ్చింది. ఆమె రాగానే షణ్ముఖ్ తెగ సంబరపడిపోయాడు. ఆమెని చూసుకుంటూ ఉండిపోయాడు.
దీప్తి తన బాయ్ ఫ్రెండ్ కి చాలా సలహాలు ఇచ్చింది. ఎమోషన్స్ తో అనవసరంగా వీక్ అవుతున్నావని.. స్ట్రాంగ్ గా ఉండమని చెప్పింది. మరో మూడు వారాల వరకు హౌస్ లోనే ఉండాలని.. ఫైనల్స్ లో కలుద్దామని చెప్పింది దీప్తి సునయన. అయితే ఇదే సమయంలో దీప్తి.. షణ్ముఖ్ కి ఓ హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె స్టేజ్ పైకి వచ్చిన వెంటనే.. రెండు వేళ్లతో మైక్ పట్టుకుంది. సెకండ్ ఫింగర్ ను పదే పదే ట్యాప్ చేస్తూ.. షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
షణ్ముఖ్ కూడా ఆ విషయాన్ని గమనించాడని.. ఆమె పక్కా ప్లాన్ ప్రకారమే హింట్ ఇచ్చిందని.. దానికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ వీడియోపై దీప్తి స్పందించింది. షణ్ముఖ్ కోసమే కాదు.. తన జీవితంలో ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎప్పుడూ చేయనంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది. ''మీ బొందరా మీ బొంద.. నా జీవితంలో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయను. షణ్ముఖ్ విషయంలోనే కాదు.. దేనికోసం కూడా అలాంటి పనులు చేయను. నా దృష్టిలో షణ్ముఖే బిగ్‌బాస్ విన్నర్'' అని దీప్తి చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
కరీంనగర్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement