అన్వేషించండి
Advertisement
Nagarjuna: సీనియర్ హీరోతో మెహ్రీన్.. భారీ రెమ్యునరేషన్ గుంజేస్తోంది..
ప్రస్తుతం 'ఎఫ్3' సినిమాలో నటిస్తోన్న మెహ్రీన్ తాజాగా మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అది కూడా సీనియర్ హీరో నాగార్జునతో అని తెలుస్తోంది.
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్.. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకొని కెరీర్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 'ఎఫ్3' సినిమాలో నటిస్తోన్న మెహ్రీన్ తాజాగా మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అది కూడా సీనియర్ హీరో నాగార్జునతో అని తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ యంగ్ హీరోయిన్లను తీసుకుంటే తెరపై జోడీ మరీ ఎబ్బెట్టుగా ఉంటోంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే కొందరు హీరోలు మాత్రం యంగ్ హీరోయిన్లతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రవితేజ లాంటి హీరో 'పెళ్లి సందడి' సినిమాలో నటించిన శ్రీలీలతో కలిసి నటించబోతున్నాడు.
అలానే నాగార్జున కొత్త సినిమాలో మెహ్రీన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తోన్న 'ఘోస్ట్' సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో అమలాపాల్ ను సంప్రదించారు. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. దీంతో నిర్మాతలు ఆమెకి బదులు మరో హీరోయిన్ కోసం వెతికారు.
ఈ క్రమంలో మెహ్రీన్ ను సంప్రదించగా.. ఆమె కూడా ఎక్కువ మొత్తాన్నే డిమాండ్ చేసింది. సాధారణంగా ఒక్కో సినిమాకి అరవై లక్షల చొప్పున తీసుకునే మెహ్రీన్ దీనికోసం మాత్రం కోటికి దగ్గర్లో అడిగిందని టాక్. మొదట్లో వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఆమె అడిగినంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకు యంగ్ హీరోలతో ఆడిపాడిన మెహ్రీన్.. ఇప్పుడు స్టార్ హీరోతో జోడీ కట్టడానికి రెడీ అవుతోంది. పైగా ఈ సినిమాలో ఆమె రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion