Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?
ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఇందులో మానస్-పింకీ-సిరిల సంభాషణ ఆకట్టుకుంటోంది.
బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే ఏడు వారాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారం నామినేట్ అయిన సభ్యులు లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ కి సంబంధించిన గేమ్ ఆడించారు బిగ్ బాస్. ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇల్లు మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందని చెప్పారు. ఛాలెంజ్ గెలిచిన సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశంతో పాటు ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెప్పారు.
Also Read: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'..
తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ అందరూ సరదాగా కనిపించరు. ముందుగా మానస్-ప్రియాంక-సిరి కూర్చొని మాట్లాడుతుండగా.. 'నేను మానస్ టాప్ 5 లో ఉంటామని' ప్రియాంక.. సిరితో చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించింది. ఆ తరువాత మానస్ 'అంకుల్స్ అందరూ బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లందరూ లోపల ఉండాలి' అని అన్నాడు. వెంటనే సిరి 'ఆంటీలంటే పింకీ వెళ్లిపోవాలి మరి' అని నవ్వుతూ కౌంటర్ వేయగా.. 'మొహం పగిలిపోద్ది' అంటూ నవ్వేసింది ప్రియాంక.
ఆ తరువాత రవి-షణ్ముఖ్ డిస్కషన్ పెట్టారు. ముందుగా రవి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ చెప్పాడు. ఆ తరువాత శ్రీరామ్ 'దుర్యోధనా..' అంటూ రవిపై డైలాగ్ వేశాడు. ఇక వాష్ రూమ్ లో శ్రీరామ్.. రవిని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. దానికి హౌస్ మేట్స్ అంతా తెగ నవ్వుకున్నారు. వెంటనే టాస్క్ కోసం అందరూ వాదించుకుంటూ కనిపించారు. ప్రోమో చివర్లో శ్రీరామ్-మానస్ బ్యాటిల్ రోప్స్ ఆడుతూ కనిపించారు.
House lockdown valla, andaru fun mode lo unnaru!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/XMZMLbjCG2
— starmaa (@StarMaa) October 26, 2021
Also Read: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?
Also Read: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని అంటున్న చిరంజీవి!
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి