అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడుతోన్న పోటీదారులు మొత్తం ఆరుగురు. వాళ్లెవరంటే..?
ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ను భిన్నంగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ఇల్లు మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందన్న బిగ్ బాస్... చాలెంజ్ గెలిచిన సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశంతో పాటూ ఇంట్లోకి ప్రవేశిస్తారని చెప్పారు. ఐదు ఛాలెంజ్ లను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు ఛాలెంజ్‌లు పూర్తి కాగా వాటిలో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ గెలిచారు.
ముందు గేమ్ లో ఆడకూడదని అనుకున్న జెస్సీ.. ఆ తరువాత గేమ్ ఆడతానని సన్నీకి చెప్పాడు. అప్పటికే ఎవరెవరు ఆడాలో జెస్సీ ఫైనల్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. హౌస్ మేట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో జెస్సీ 'ఇక ఆడను.. నేను అన్ ఫిట్' అంటూ డైలాగ్ వేశాడు.
రంగు పడుద్ది..
పెయింట్ బ్రష్ ఉపయోగించి కాన్వాస్ పై రంగు వేయాల్సి ఉంటుంది. ఏ కంటెస్టెంట్ రంగు అయితే ఎక్కువ ఉంటుందో వాళ్లు ఈ టాస్క్ విన్నర్ అని చెప్పారు. ఈ టాస్క్ లో ప్రియాంక-యానీ పాల్గొనగా.. యానీ మాస్టర్ ను విన్నర్ గా ప్రకటించాడు సన్నీ.
మనిద్దరం కలిసి ఓ సాంగ్ చేద్దామని సిరి.. షణ్ముఖ్ ని అడగ్గా.. 'హామీదకి కూడా ఏమైనా సాంగ్ చేయాలనుకున్నపుడే నేను గుర్తొచ్చేవాడిని' అంటూ డైలాగ్ వేయడంతో సిరి హర్ట్ అయింది. దీంతో సిరికి సారీ చెప్పాడు షణ్ముఖ్. 'ఎవడికి కావాలి నీ సారీ.. అనాల్సిన మాటలన్నీ అనేసి' అంటూ అరవగానే.. డైనింగ్ టేబుల్ మీద తింటున్న శ్రీరామ్ ఉలిక్కిపడ్డాడు.
కారులో హుషారుగా..
ఈ ఛాలెంజ్ లో భాగంగా టాయ్ కార్ ను నడిపించుకుంటూ పూల కుండీలను తీసుకొని వారి బాక్స్ లలో చేర్చాలి. ఈ టాస్క్ లో సన్నీ-కాజల్ పాల్గొనగా.. సన్నీ విన్నర్ గా నిలిచాడు.
అయితే కాజల్ లైట్ తీసుకొని గేమ్ ఆడిందని రవి-సిరి-షణ్ముఖ్ చర్చించుకున్నారు. ఫ్రెండ్షిప్ గేమ్ ఆడిందని షణ్ముఖ్ కామెంట్ చేశాడు.
కెప్టెన్సీ పోటీదారులు కాలేకపోయిన వారికి బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చారు. అదేంటంటే.. బంతిలో ఉంది భాగ్యం.. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ పాల్గొనగా.. మానస్ గెలిచాడు.
ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడుతోన్న పోటీదారులు.. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ,మానస్.
Also Read: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion