Akkineni Nagarjuna: 'ఆర్ఆర్ఆర్'తో పోటీ అంటే.. రిస్క్ ఏమో బంగార్రాజూ..
'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి రెండు పెద్ద సినిమాలతో పోటీకి ఏ సినిమా కూడా ముందడుగు వేయదు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం తన 'బంగార్రాజు' సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట.
వచ్చే ఏడాది సంక్రాంతి జోరు ఇప్పటినుంచే మొదలైపోయింది. నిజానికి మహేష్ బాబు 'సర్కారు వారి పాట', పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' వంటి సినిమాలు సంక్రాంతికి రావాలనుకున్నాయి. అఫీషియల్ గా డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో జనవరిలో వస్తుండడంతో ఆ టైంకి రావాలనుకున్న సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఒక్క ప్రభాస్ నటిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమా తప్ప మిగిలినవన్నీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: షూటింగ్ ఎగ్గొట్టిన తమన్నా.. ఐదు కోట్ల నష్టం.. 'మాస్టర్ చెఫ్' నిర్వాహకుల ఆరోపణలు
'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి రెండు పెద్ద సినిమాలతో పోటీకి ఏ సినిమా కూడా ముందడుగు వేయదు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం తన 'బంగార్రాజు' సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి ప్రీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యనే సినిమాను లాంఛ్ చేశారు. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతి శెట్టి లాంటి తారలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
ఆలస్యంగా సినిమాను మొదలుపెట్టినా.. నవంబర్ నాటికి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి.. డిసెంబర్ చివరికి ఫస్ట్ కాపీ రెడీగా పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కచ్చితంగా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామంటూ నాగార్జున ఫీలర్లు వదులుతున్నారు. ఓ పక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలే సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుంటే.. నాగార్జున మాత్రం పోటీకి రెడీ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య 'బంగార్రాజు' ఎలా నెట్టుకొస్తాడో అని ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు ఈ సినిమాను డిసెంబర్ నాటికి రెడీ చేయగలరా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 'బంగార్రాజు' సినిమా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. దీనికోసం భారీ సెట్స్, గ్రాఫిక్స్ వర్క్ అవసరం ఉంటుంది. ఇదంతా రెండు నెలల్లో పూర్తవుతుందని అనుకోవడం పొరపాటే. కానీ నాగార్జున మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారట.
Also Read: ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే...!
Also Read: 'మీ అమ్మాయి పెళ్లికోసం డబ్బు దాచకండి' సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
Also Read: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి