Bhola Shankar: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
వేదాళం రీమేక్ గా వస్తున్న చిరు మూవీ ‘భోళా శంకర్’. ఈ సినిమాకు ముహూర్తం పెట్టేశారు.
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వేదాళం’. ఈ సినిమాను రీమేక్ చేద్దామని చాలా మంది భావించారు. చివరకు చిరంజీవి-మెహెర్ రమేష్ కాంబినేషన్లో సినిమా సెట్ అయింది. అయితే ఇంతవరకు సినిమా షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. కాస్టింగ్ సెలెక్షన్లతోనే ఇంతవరకు సమయం గడిచిపోయింది. ఇందులో చిరుకు చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించబోతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముహుర్తం వేడుకను నవంబర్ 11న ఉదయం 7.45 నిమిషాలకు ప్రారంభించనున్నట్టు దర్శకుడు మెహెర్ రమేష్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇక రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి మొదలవుతుందని ప్రకటించారు.
సైరా సినిమా తరువాత చిరు సినిమా ఏదీ ఇంతవరకు విడుదలవ్వలేదు. ఆచార్య సినిమాకు కమిట్ అయినప్పటికీ కరోనా వల్ల అది చాలా ఆలస్యమైంది. ఆ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రయూనిట్. ఆ తరువాత మలయాళ సినిమా లూసిఫర్ ను గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అందులో చిరు నటిస్తున్నారు. ఆ సినిమా కూడా సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాల నేపథ్యంలో ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ చాలా లేటవుతుందని భావించారంతా. అనుకున్నట్టు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికి ఆ విషయంలో ఓ క్లారిటీని ఇచ్చారు మెహెర్ రమేష్.
వేదాళం తమిళ వెర్షన్లో అజిత్ హీరోగా నటించారు. అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టింది ఈ సినిమా. 2015 లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేస్తున్నారు. వేదాళంలో అజిత్ చెల్లెలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించింది. అయితే ‘భోళా శంకర్’ లో హీరోయిన్ ఎవరో ఇంకా తేలాల్సి ఉంది.
The Auspicious Day is Set for the MEGA LAUNCH ✨
— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) October 27, 2021
MEGA 🌟 @KChiruTweets #BholaaShankar 🔱 Muhurtam Ceremony will be held on 11-11-21, 7:45AM 🎬
Mega Shoot Begins from 15-11-21🎥@KeerthyOfficial @AnilSunkara1 #MahatiSwaraSagar @AKentsOfficial @BholaaShankar @kishore_Atv pic.twitter.com/zhqlnTSbfW
Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ
Also read: ఒత్తయిన జుట్టు కావాలా... ఈ మూడూ తినండి చాలు
Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ