News
News
X

Balakrishna 'Unstoppable': 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య ప్రోమో.. అదిరిపోయిందంతే..

తొలిసారి బాలయ్య యాంకర్ అవతారం ఎత్తడంతో Unstoppable షోపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. 

FOLLOW US: 
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓ షో చేయడానికి ఒప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' నిర్వహించే 'Unstoppable' అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు బాలయ్య. నవంబర్ 4 నుంచి ఈ షో టెలికాస్ట్ కానుంది. ఈ షోలో బాలయ్య పేరున్న సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయబోతున్నారు. తొలిసారి బాలయ్య యాంకర్ అవతారం ఎత్తడంతో ఈ షోపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. 
 
'నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్పశుద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. కలుద్దాం ఆహాలో' అంటూ భారీ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు బాలయ్య. ఇందులో బాలయ్య లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రోమోలో విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. బాలయ్య గుర్రంపై వచ్చే సీన్ హైలైట్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ మరి హైలైట్.
 
ప్రశాంత్ వర్మ ఈ షోకి దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా 12 ఎపిసోడ్స్ తో ఒక సీజన్ ను విడుదల చేయబోతున్నారు. ఈ షో కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కి రూ.40 లక్షల చొప్పున బాలయ్యకు ఇస్తున్నారట. అంటే మొత్తం రూ.4.80 కోట్లు. ఈ షో ద్వారా వచ్చే డబ్బుని బాలయ్య  ఛారిటీ కోసం వినియోగించాలని భావిస్తున్నారట. ఆయన ఈ షో ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కూడా అదేనని చెబుతున్నారు. ఇక ఈ షోలో మోహన్ బాబు ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవి లాంటి సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తారట.
 
ఇక సినిమాల విషయానికొస్తే.. బాలకృష్ణ రీసెంట్ గానే 'అఖండ' సినిమాను పూర్తి చేశారు. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అఖండ' పూర్తి కావడంతో బాలయ్య.. గోపీచంద్ మలినేని సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారు. 

Published at : 27 Oct 2021 05:19 PM (IST) Tags: Balakrishna Unstoppable Show Unstoppable Promo Balakrishna's Unstoppable

సంబంధిత కథనాలు

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Whats On OTT This Week : తెలుగు 'హైవే', 'తమిళ్ రాకర్స్', హాలీవుడ్ 'షి హల్క్' - ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే

Whats On OTT This Week : తెలుగు 'హైవే', 'తమిళ్ రాకర్స్', హాలీవుడ్ 'షి హల్క్' - ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Hello World Web Series Review - హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Hello World Web Series Review - హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్‌పై ధీమాగా కమలనాథులు

BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్‌పై ధీమాగా కమలనాథులు

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

MLA Ashok Arrest: పలాసలో హై టెన్షన్, టీడీపీ ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్ - అసలేమైందంటే?

MLA Ashok Arrest: పలాసలో హై టెన్షన్, టీడీపీ ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్ - అసలేమైందంటే?

Karthikeya 2:‘కార్తికేయ-2’ దర్శకుడికి సర్ ప్రైజ్.. బిగ్ బీ పిలిచి ఏమన్నారంటే..?

Karthikeya 2:‘కార్తికేయ-2’ దర్శకుడికి సర్ ప్రైజ్.. బిగ్ బీ పిలిచి ఏమన్నారంటే..?