News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Bigg Boss 5 Telugu Contestants: ‘బిగ్ బాస్ 5’ అప్‌డేట్స్: కంటెస్టెంట్స్ జాబితా లీక్.. సిరి డ్యాన్స్‌తో షో ఆరంభం? విన్నర్ అతడేనట!

‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా అలా లీకైందో లేదో.. అప్పుడే విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. అప్పుడే ఓ నటుడిని విజేతగా ప్రకటించేశారు నెటిజనులు.

FOLLOW US: 
Share:

బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సందడి మొదలైపోయింది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ప్రోమో విడుదలైన గంటలోనే మూడు లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ఒక్కో కంటెస్టెంట్ హౌస్‌లోకి వెళ్లనున్నారు. వారి కంటే ముందుగా హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హౌస్ లోపల కంటెస్టెంట్స్ ఉండే గదులు, కన్ఫెషన్ రూమ్, కిచెన్, ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, జైల్‌ను నాగ్ చూపిస్తారు. ఆ తర్వాత సీరియల్ నటి, యూట్యూబ్ స్టార్ సిరితో ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. చివర్లో యాంకర్ రవి డ్యాన్స్‌తో ముగుస్తుందని సమాచారం. అలాగే.. ఈ రోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల జాబితా కూడా ఆన్‌లైన్ లీకైంది. 

ఈ సారి ‘బిగ్ బాస్ 5’ జాబితాలోని కంటెస్టెంట్లను చూస్తుంటే.. గొడవలు బాగానే జరిగేలా ఉన్నాయి. పైగా వీరిలో కొంతమందికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. చెప్పాలంటే.. ఈ షో టీవీ vs సోషల్ మీడియాలా ఉండబోనుంది. అయితే, ఎవరికి ఎంత క్రేజ్ ఉన్నా.. ఫాలోయింగ్ ఉన్నా.. చివరికి వారి వ్యక్తిత్వమే విజేతగా నిలుపుతుంది. అలాంటివారే విజేతగా బయటకు వస్తారు. ఎవరైతే ఎక్కువగా హౌస్‌మేట్స్ నుంచి వ్యతిరేకత పొందుతారో.. వారికే ఎక్కువ సింపథీ క్రియేట్ అవుతుంది. ఓటింగ్ కూడా వారికి పడుతుంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మాకు లభించిన జాబితా ప్రకారం హౌస్‌లోకి ఎంటరైన సెలబ్రిటీల జాబితా ఇలా ఉంది. 
యాంకర్ రవి - టీవీ యాంకర్
షణ్ముఖ జస్వంత్ - యూట్యూబ్ స్టార్
యానీ మాస్టర్ - కొరియోగ్రాఫర్
నటరాజ్ మాస్టార్ - కొరియోగ్రాఫర్ 
శ్వేతా వర్మ - సినిమా నటి
ప్రియ - సీరియల్, సినీ నటి
లహరి - సీరియల్ నటి
మానస్ - సీరియల్ నటుడు
సరయు - యూట్యూబ్ స్టార్ (7 ఆర్ట్స్)
కాజల్ - ఆర్జే 
విశ్వ - సీరియల్ నటుడు
శ్రీరామ చంద్ర - గాయకుడు 
సన్నీ - వీజే
ఉమా దేవి - సీరియల్ నటి
సిరి హన్మంత్ - సీరియల్ నటి, యూట్యూబ్ స్టార్
సాయి తేజ (ప్రియాంక) - జబర్దస్త్ కమెడియన్
లొబో - యాంకర్ 
ఫరిదా - సింగర్ 

వీరికే క్రేజ్ ఎక్కువ: యూట్యూబ్ స్టార్, దీప్తి సునైన బాయ్ ఫ్రెండ్ షన్ముఖ్‌ జశ్వంత్‌కు ఎనలేని క్రేజ్ ఉంది. అతడు ఇంకా హౌస్‌లోకి వెళ్లాడో లేదో తెలియకపోయినా.. అతడే ఈ సీజన్ బిగ్ బాస్ విజేత అని అభిమానులు అంటున్నారు. షన్ముఖ్‌కు యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. ఇతడు నటించిన షార్ట్ ఫిల్మ్‌ సీరిస్‌లు యూట్యూబ్‌లో సూపర్ హిట్. ‘అరే.. ఎంట్రా ఇది’ అనే డైలాగ్‌తో షన్ముఖ్‌ ఎక్కడికో వెళ్లిపోయాడు. షన్ముఖ్ తర్వాత ‘7 ఆర్ట్స్’ సరయుకు కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అయితే, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమా లేదా.. బిగ్ బాస్‌లో కూడా కొనసాగుతుందా లేదా అనుమానం కూడా కలుగుతుంది. సరయు బిగ్ బాస్‌లో కూడా బూతులు మాట్లాడుతుందా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి. అయితే, బిగ్ బాస్‌లో వ్యక్తిత్వానికే ఎక్కువ మార్కులు పడుతుంటాయనే సంగతి తెలిసిందే. యాంకర్ రవి, సీరియల్ నటి ప్రియ, యానీ మాస్టార్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్‌కు కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే, పైన పేర్కొన్న వివరాలన్నీ ఆన్ ‌లైన్ లీకైన, విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన జాబితా మాత్రమే. షో మొదలైన తర్వాతే.. వీరిలో ఎవరు వెళ్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇందుకు మీరు ఆదివారం 6 గంటల వరకు వేచి చూడాల్సిందే. 

Also Read: బిగ్‌బాస్ తెలుగు 5 ప్రోమో.. హౌస్‌లోకి నాగ్ ఎంట్రీ, ఇక టన్నుల కొద్ది కిక్!

Also Read: బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్-5 సందడి.. ఆ ఐదుగురికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్

Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?

Published at : 05 Sep 2021 12:49 PM (IST) Tags: Akkineni Nagarjuna nagarjuna Bigg Boss Telugu season 5 Bigg Boss 5 Telugu Bigg Boss Telugu 5 అక్కినేని నాగార్జున Bigg Boss Telugu Promo బిగ్ బాస్ 5 తెలుగు ప్రోమో Bigg Boss 5 Telugu Contestents Bigg Boss 5 Telugu Contestents list

ఇవి కూడా చూడండి

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

టాప్ స్టోరీస్

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
×