Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ తెలుగు 5 ప్రోమో.. హౌస్‌లోకి నాగ్ ఎంట్రీ, ఇక టన్నుల కొద్ది కిక్!
బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. ఈ రోజు సాయంత్రం మొదలుకానున్న బిగ్ బాస్ ప్రోమోను ఇక్కడ చూసేయండి.
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ‘బిగ్ బాస్-5’ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు నాగ్ గ్రాండ్ ఎంట్రీతో ఈ రియాలిటీ షో ఆరంభం కానుంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ముగించుకుని టెలికాస్ట్‌కు సిద్ధంగా ఉంది. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న కంటెస్టులు ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ‘స్టార్ మా’ ప్రోమో విడుదల చేసింది. ఇందులో నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గ్రీన్-పింక్ కలర్ కాంబినేషన్‌లో ఈ సారి బిగ్ బాస్ హౌస్ భిన్నంగా ఉంది. బ్రిటీష్ కట్టడాలను తలపించేలా సెట్ ఉంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మాట్లాడుతూ ఇక్కడ కిక్కు టన్నుల కొద్ది ఉంటుందంటూ షో మీద అంచనాలు పెంచేశారు. అంతేగాక.. సాయంత్రం కంటెస్టెంట్ల డ్యాన్సులతో షో హోరెత్తనున్నట్లు తెలుస్తోంది.
ప్రోమోను ఇక్కడ చూడండి:
ఈ సారి ‘బిగ్ బాస్ 5’లో కనిపించే కంటెస్టెంట్లను చూస్తుంటే.. గొడవలు బాగానే జరిగేలా ఉన్నాయి. పైగా వీరిలో కొంతమందికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. చెప్పాలంటే.. ఈ షో టీవీ vs సోషల్ మీడియాలా ఉండబోనుంది. అయితే, ఎవరికి ఎంత క్రేజ్ ఉన్నా.. ఫాలోయింగ్ ఉన్నా.. చివరికి వారి వ్యక్తిత్వమే విజేతగా నిలుపుతుంది. అలాంటివారే విజేతగా బయటకు వస్తారు. ఎవరైతే ఎక్కువగా హౌస్‌మేట్స్ నుంచి వ్యతిరేకత పొందుతారో.. వారికే ఎక్కువ సింపథీ క్రియేట్ అవుతుంది. ఓట్లు కూడా వారికి బాగానే పడతాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మాకు లభించిన జాబితా ప్రకారం హౌస్‌లోకి ఎంటరైన సెలబ్రిటీల జాబితా ఇలా ఉంది.
యాంకర్ రవి - టీవీ యాంకర్
షణ్ముఖ జస్వంత్ - యూట్యూబ్ స్టార్
యానీ మాస్టర్ - కొరియోగ్రాఫర్
నటరాజ్ మాస్టార్ - కొరియోగ్రాఫర్
శ్వేతా వర్మ - సినిమా నటి
ప్రియ - సీరియల్, సినీ నటి
లహరి - సీరియల్ నటి
మానస్ - సీరియల్ నటుడు
సరయు - యూట్యూబ్ స్టార్ (7 ఆర్ట్స్)
కాజల్ - ఆర్జే
విశ్వ - సీరియల్ నటుడు
శ్రీరామ చంద్ర - గాయకుడు
సన్నీ - వీజే
ఉమా దేవి - సీరియల్ నటి
సిరి హన్మంత్ - సీరియల్ నటి, యూట్యూబ్ స్టార్
సాయి తేజ (ప్రియాంక) - జబర్దస్త్ కమెడియన్
లొబో - యాంకర్
Also Read: బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్-5 సందడి.. ఆ ఐదుగురికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్
Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?