Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ''అభయహస్తం'' దక్కెదెవరికి... కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మళ్లీ రచ్చ రచ్చే...
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఏడోవారం నడుస్తోంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ''అభయహస్తం''.. ఈ టాస్క్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమో వచ్చింది..
అయితే గొడవ, లేదంటే ఏడుపు.. బిగ్ బాస్ సీజన్ 5 లో ఇంతకుమించి ఏం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా కూడా సరదా అనే మాటే లేదు. టాస్క్ ఇస్తే చాలు కొట్టుకుందికే అన్నట్టు ఇంటి సభ్యులు చెలరేగిపోతున్నారు. అందుకే గడిచిన సీజన్లతో పోలిస్తే పెద్దగా టాస్కులు ఉండడం లేదు. సోమవారం మొత్తం నామినేషన్ల హడావుడి, మంగళవారం నుంచి శుక్రవారం వరకూ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్, కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇక వీకెండ్ ఏలాగూ నాగార్జున ఎంట్రీ ఉంటుంది. ఇంతకీ విషయం ఏంటంటే నిన్నంతా నామినేషన్ల పేరుతో ఏడిపించేసిన బిగ్ బాస్ ఈ రోజు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ''అభయహస్తం'' ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇల్లు మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందన్న బిగ్ బాస్... చాలెంజ్ గెలిచిన సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశంతో పాటూ ఇంట్లోకి ప్రవేశిస్తారని చెప్పారు.
BB house in lockdown for captaincy contender task...Evaru enter avtharu?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/gj891KfxVi
— starmaa (@StarMaa) October 26, 2021
అభయహస్తం టాస్క్ లో భాగంగా వచ్చిన ప్రోమోలో షణ్ముక్-లోబో బరిలో దిగారు. పేడలో కాయిన్స్ ఏరి వారి వారి బౌల్స్ లో వేయాల్సి ఉంటుంది. వందమంది వందవాగుతారు పట్టించుకోవాల్సిన అవసరం లేదని షణ్ముక్ అన్న మాటకి విశ్వ రియాక్టయ్యాడు. ఆ వందమందిలో నువ్వున్నావా అనేసరికి ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. మరోవైపు నీటిగా ఉన్న కాయిన్సే లెక్కించాలని ఎక్కడా చెప్పేలేదన్న కాజల్ పై లోబో ఫైరయ్యాడు. నువ్వు అక్కడికి పోయి మాట్లాడుకో అని చెప్పడంతో నీకు వినే ఉద్దేశం లేకపోతే చెవులు మూసుకో అంది కాజల్. ఎక్కిడకో వెళ్లి మాట్లాడాల్సిన అవసరం తనకేంటన్న కాజల్ ఇక్కడే ఉంటానని బరాబర్ మాట్లాడతా అని తేల్చేసింది. చూస్తుంటే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో మళ్లీ రచ్చ షురూ అయినట్టే.
Also Read: బాలయ్యకు స్టెప్పులు నేర్పబోతున్న నటరాజ్ మాస్టర్?
Also Read: బిగ్ బాస్ ఇంట్లో సిరి, షణ్ముక్ చదవకుండా మిస్సైన లెటర్స్ ఇవే...
Also Read: రెండు రోజుల ముందే ప్రీమియర్లు.. పూరికి ఇంత ధైర్యమేంటో..?
Also Read: మలయాళంలో నాగచైతన్య 'ప్రేమతీరం'... 'ప్రేమమ్' స్థాయిలో హిట్టవుతుందా?
Also Read: దిల్లీలో ఘనంగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి