Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో సిరి, షణ్ముక్ చదవకుండా మిస్సైన లెటర్స్ ఇవే...
బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం నామినేషన్లలో భాగంగా లెటర్స్ మిస్సైన కంటిస్టెంట్స్ లో కొందరి లేఖలు వారి ఇన్ స్టా అకౌంట్లో సందడి చేస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం నామినేషన్లు భారంగా గడిచాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా లేఖల ద్వారా నామినేట్ చేసుకున్నారు ఇంటి సభ్యులు. ఇద్దరిద్దరికి చొప్పున లెటర్స్ పంపించారు. ఒకరు త్యాగం చేసి నామినేట్ అయితే..మరొకరు లెటర్ తీసుకోవచ్చన్నమాట. ముందుగా శ్రీరామ్, మానస్ లను పవర్ రూమ్ లోకి పిలవగా.. వారికి ప్రియాంక-లోబో లేఖలు వచ్చాయి. ప్రియాంకకు తన తల్లిదండ్రుల నుంచి లేఖ రావడంతో అదే విషయాన్ని లోబోకి చెప్పి కన్విన్స్ చేసి లెటర్ తీసుకుంది. లోబో నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత సిరి-విశ్వకు లేఖలు రావడంతో సిరి త్యాగం చేసి విశ్వ కి లెటర్ ఇచ్చింది. ఆ తర్వాత మానస్-ఆనీ మాస్టర్ ల లెటర్స్ రాగా మానస్ త్యాగం చేశాడు. నువ్ లేకపోతే నా జీవితంలో ఇంకేం లేదు నిక్కు అంటూ కొడుకును గుర్తుచేసుకుంటూ ఏడ్చేసింది ఆనీ. రవి- శ్రీరామ్ ల లెటర్స్ లో శ్రీరామ్ కి ఫ్యామిలీతో ఎలాంటి కాంటాక్ట్ లేదని.. తనకు లెటర్ ఇవ్వడమే కరెక్ట్ అని రవి చెప్పడంతో ఫైనల్ గా శ్రీరామ చంద్రకు లెటర్ ఇచ్చారు. షణ్ముఖ్-కాజల్ వచ్చిన లెటర్స్ లో కాజల్ లెటర్ తీసుకోమని షన్ను త్యాగం చేశాడు. ఇప్పుడు వాళ్లు మిస్సైన లెటర్స్ వాళ్ల ఇన్ స్టా గ్రామ్ లో ఉన్నాయి..
Also Read: ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
హౌస్ లో సిరి చదవకుండా మిస్సైన లెటర్ ఇదే
View this post on Instagram
షణ్ముక్ మిస్సైన లెటర్ ఇదే
View this post on Instagram
ఇక జెస్సీ లెటర్..కెప్టెన్ సన్నీకిచ్చిన బిగ్ బాస్ తనకి ఆ లెటర్ ఇవ్వాలంటే ఎవరైనా నామినేట్ చేసుకుని వారి లెటర్ వదులుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో శ్రీరామ్ త్యాగం చేశాడు. ఇక లెటర్స్ ప్రక్రియ ద్వారా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర. సన్నీకి కూడా ఇంటి నుంచి ఒక లేఖ వచ్చిందని.. కెప్టెన్ అయిన కారణంగా ఎలాంటి షరతులు లేకుండానే లెటర్ అందించారు బిగ్ బాస్.
Also Read: రెండు రోజుల ముందే ప్రీమియర్లు.. పూరికి ఇంత ధైర్యమేంటో..?
Also Read: మలయాళంలో నాగచైతన్య 'ప్రేమతీరం'... 'ప్రేమమ్' స్థాయిలో హిట్టవుతుందా?
Also Read: దిల్లీలో ఘనంగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి