అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
బిగ్ బాస్ షోకి రావడానికి ప్రియా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతగా ఏడు వారాలను పూర్తి చేసుకుంది. ఏడో వారంలో హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయింది. నిజానికి అందరూ కూడా యానీ మాస్టర్ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ప్రియాను హౌస్ నుంచి బయటకు పంపించి షాకిచ్చారు బిగ్ బాస్. గత వారంలో సన్నీతో ఆమె గొడవ పడడం.. చెంప పగలగొడతా అంటూ పదే పదే అనడం.. ఇలా కొన్ని విషయాల కారణంగా ప్రియాకు ఓట్లు బాగా తగ్గాయి. కానీ ఆమెను హౌస్ లోనే ఉంచుతారని అంతా అనుకున్నప్పటికీ ఏడో వారానికే బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటకొచ్చేసింది.
అటు సినిమాల్లో.. ఇటు సీరియల్స్ లో నటిస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ప్రియా.. బిగ్ బాస్ షోకి రావడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ బ్యూటీ వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ఏడు వారాలకు గాను ఆమె పది లక్షలకు పైగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ ను, పాపులారిటీను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ నిర్వాహకులు ఇంత మొత్తాన్ని ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది.
నిజానికి ప్రియాకి ఇచ్చిన రెమ్యునరేషన్ తక్కువనే చెప్పాలి. హౌస్ లో ఉన్న రవి, షణ్ముఖ్ లాంటి వాళ్లకు వారానికి నాలుగు లక్షల చొప్పున ఇస్తున్నారని టాక్. వాళ్లతో పోల్చుకుంటే ప్రియాకు చాలా తక్కువనే చెప్పాలి. గేమ్ లో ఇప్పుడిప్పుడే ప్రియా పుంజుకుంటుంది. గత వారం కెప్టెన్సీ టాస్క్ లో ఆమె చేసిన రచ్చ అంత సులువుగా మర్చిపోలేం. ఇంతకాలం సన్నీతో గొడవ పడిన ఆమె అతడు కెప్టెన్ అయిన దగ్గరనుంచి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ప్రియా.. హౌస్ నుంచి వెళ్లిపోతూ.. తన ప్లేట్ లో తినే హక్కు సన్నీకి మాత్రమే ఉందని చెప్పి మరీ వెళ్లింది. ప్రియా హౌస్ లో ఉండి ఉంటే మాత్రం మంచి కంటెంట్ అయితే వచ్చేది.
Also Read: బిగ్ బాస్ ఎమోషనల్ గేమ్.. తట్టుకోలేక ఏడ్చేసిన హౌస్ మేట్స్..
Also Read: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట..
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion