Nitin Mehta: ఇండియన్ ఆర్మీను వదులుకొని.. 'అఖండ'లో విలన్ గా..
'అఖండ' సినిమాలో విలన్ గా నటించిన నితిన్ మెహతా.. ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మీకు తెలుసా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిరోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లో కూడా 'అఖండ' భారీ విజయాన్ని అందుకుంది. రెండు రోజుల్లో ఈ సినిమాకి రూ.50 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. అమెరికాలో అయితే ప్రీమియర్ షో కలెక్షన్స్ తో రికార్డులు బద్దలు కొట్టింది.
బోయపాటి డైరెక్షన్ తో పాటు.. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి బాక్సులు బద్దలయ్యాయి. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ తో పాటు మరో నటుడు నితిన్ మెహతా కూడా కనిపించారు. స్వామిజీ గెటప్ లో క్రూరమైన పనులు చేసే క్యారెక్టర్ అది. ఆ పాత్రకు నితిన్ మెహతా పూర్తి న్యాయం చేశారు. అయితే ఈయనొక ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మీకు తెలుసా..?
నిజమేనండీ.. నితిన్ మెహతా 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో సేవలు అందించారు. ఆ తరువాత ఒక ప్రొఫెషనల్ మోడల్ గా, నటుడిగా మారాలని కలలు కని.. తన యూనిఫామ్ ను తీసి పక్కన పెట్టారు. బాలీవుడ్ లో 'కాబిల్', 'భూమి' వంటి సినిమాల్లో నటించారాయన. సౌత్ లో కూడా రెండు, మూడు సినిమాల్లో నటించారు. కానీ ఏదీ సరైన గుర్తింపును తీసుకురాలేకపోయింది. అయితే 'అఖండ' మాత్రం అతడికి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాతో హాట్ టాపిక్ గా మారారు నితిన్ మెహతా. అతడికి విలన్ గా మరిన్ని అవకాశాలు రావడం ఖాయం!
View this post on Instagram
Also Read: బాలయ్య షోలో మహేష్ బాబు.. ఫ్యాన్స్ వెయిటింగ్..
Also Read:పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: కత్రినా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















