అన్వేషించండి

VD12 Movie: శ్రీలీల ప్లేస్​లో ‘ఏజెంట్’ బ్యూటీ, రౌడీ బాయ్ మూవీ నుంచి తప్పుకున్న తెలుగమ్మాయి!

విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో వస్తున్న తాజా చిత్రం నుంచి హీరోయిన్ శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ‘ఏజెంట్’ హీరోయిన్ సాక్షిని మేకర్స్ ఓకే చేశారట.

తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీలీల కెరీర్ మాంచి స్వింగ్​లో కొనసాగుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలన్నీ చక్కటి విజయాలు అందుకోవడంతో చిత్ర నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఆమె ఫస్ట్ చాయిస్ అవుతోంది. ప్రస్తుతం అరడజన్ కు పైగా చిత్రాల్లో నటిస్తోంది శ్రీలీల. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తల సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే?

అప్పట్లో హీరోయిన్ మార్పు వార్తలను కొట్టిపారేసిన చిత్రబృందం

కొద్ది రోజుల క్రితం యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ సినిమాను ప్రకటించారు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల ఓకే అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి కొన్ని వారాల క్రితమే ఆమె ఈ సినిమా చేయట్లేదనే వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఆమె స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఓకే చేసినట్లు టాక్ వినిపించింది. అయితే, ఈ వార్తలను చిత్ర నిర్మాన సంస్థ కొట్టిపారేసింది. విజయ్ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోలేదని వెల్లడించింది. ఆమే ఈ సినిమాలో హీరోయిన్ గా ఉంటుందని తేల్చి చెప్పింది.  

విజయ్-గౌతమ్ మూవీ నుంచి తప్పుకున్న శ్రీలీల

ఆ తర్వాత హీరోయిన్ మార్పు వార్తలు సద్దుమణిగాయి. తాజాగా మరోసారి ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాలి. వచ్చే ఏడాది వేసవిలోగా పూర్తి కావాలి. కానీ, ఇప్పటి వరకు సినిమా సెట్స్ మీదకే రాలేదు. రకరకాల కారణాలతో సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది. ఇదే సమయంలో శ్రీలల డేట్లు కుదరడం లేదట. ఆమె ఓవైపు సినిమాలు చేస్తూనే  మరోవైపు చదువును కంటిన్యూ చేస్తోంది. పరీక్షల సమయంలో సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటుంది. అయితే, ఈసారి కూడా ఆమె పరీక్షలకు హాజరుకానుంది. అదే సమయంలో గౌతమ్ తన సినిమాకు డేట్లు ఇవ్వాలని కోరారట. అయితే తను కుదరదని చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీలీల స్థానంలో సాక్షి వైద్య ఫిక్స్!   

ఇక ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడంతో చిత్ర నిర్మాతలు కొత్త హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారట. చివరకు ‘ఏజెంట్’ సినిమాలో నటించిన సాక్షి వైద్యను సంప్రదించారట. విజయ్ సరసన సాక్షి అయితే బాగుంటుందని దర్శకుడు గౌతమ్ భావిస్తున్నారట. దాదాపు ఆమె ఈ సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Read Also: చిరంజీవి సచిన్, పవన్ కల్యాణ్ విరాట్ కోహ్లీ, భలే చెప్పావయ్యా వరుణ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Embed widget