అన్వేషించండి

Varun Tej: చిరంజీవి సచిన్, పవన్ కల్యాణ్ విరాట్ కోహ్లీ, భలే చెప్పావయ్యా వరుణ్!

మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా స్టార్ స్టోర్ట్స్ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా హీరోలను, క్రికెట్ స్టార్స్ తో కంపేర్ చేశారు. ఇంతకీ ఆయన ఎవరిని ఎవరితో పోల్చారంటే?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వరల్డ్ కప్ ఫీవర్ లో ఉన్నారు క్రికెట్ అభిమానులు. 2023 క్రికెట్ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అన్ని మ్యాచ్ లు భారత్ లోనే జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వరుస బెట్టి అన్ని మ్యాచ్ లను చూసేస్తున్నారు. భారత్ తాజా ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడగా, అన్నింటిలోనూ విజయకేతనం ఎగురవేసి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇక వరల్డ్ కప్ నేపథ్యంలో పలువురు సినీ తారలు స్టార్ స్టోర్స్ తెలుగు లైవ్ షోలలో పాల్గొని ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ సైతం ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్, నటుడు నందు అడిగిన ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. తెలుగు సినిమా స్టార్స్ ఏ క్రికెటర్ తో సరితూగుతారో చెప్పుకొచ్చారు.  

మెగా హీరోలను క్రికెటర్లతో పోల్చిన వరుణ్

తొలుత మెగాస్టార్ చిరంజీవి ఎవరితో సరిపోలుతారో చెప్పారు వరుణ్. క్రికెట్ దేవుడిగా భావించే చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు వరుణ్. అందుకే మెగాస్టార్ చిరంజీవిని సచిన్ తో సరితూగలరని చెప్పారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లోని ఆవేశం, ఆలోచన రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి సూట్ అవుతుందన్నారు. ఇద్దరి మధ్య అగ్రెసినవ్ నెస్ అనేది కామన్ పాయింట్ అన్నారు. అయితే, వారి ఆవేశం వెనుక ఓ కచ్చితమైన కారణం ఉంటుందని చెప్పారు. బేస్ లెస్ అగ్రెసివ్ అనేది వీరిలో కనిపించదన్నారు .ఇలాంటి అలవాటు క్రికెట్ లో అయినా, సినిమాల్లో అయినా, రాజకీయాల్లోనైనా కచ్చితంగా ఉండాల్సిందేనన్నారు. ఇక రామ్ చరణ్ ను రోహిత్ శర్మతో పోల్చారు వరుణ్. ఇద్దరు చాలా కూల్ గా తమ పని తాము చేసుకుని వెళ్తారని చెప్పారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కేఎల్ రాహుల్ ఒకేలా కనిపిస్తారని చెప్పారు. ఇద్దరి హార్డ్ వర్క్ ఒకేలా ఉంటుందన్నారు. ఇక తన తండ్రి నాగ బాబును సీనియర్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తో పోల్చారు. ఇద్దరి ఆలోచన, వ్యవహార శైలి ఒకే మాదిరగా ఉంటుందన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ను బుమ్రాతో పోల్చారు. సాయి ధరమ్ తేజ్ తన లాగే మంచి క్రికెట్ అభిమాని అని చెప్పుకొచ్చారు.

 

నవంబర్‌ 1న వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి 

అటు త్వరలోనే వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. నవంబర్‌ 1న ఇటలీ లో వీరి వివాహం జరగనుంది. మెగా ఫ్యామిలీ ఇప్పటికే ఇటలీకి వెళ్లింది.  అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయి. 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు.  సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ లో ఈ వేడుక జరగనుంది.

Read Also: ‘టైగర్ 3’లో టవల్ సీన్‌పై స్పందించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ - ఆ సన్నివేశానికి అన్ని రోజులు పట్టిందా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
TGPSC: గ్రూప్- 2  ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల విండో ఓపెన్, అబ్జెక్షన్స్ ఇలా నమోదు చేయాలి
గ్రూప్- 2 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల విండో ఓపెన్, అబ్జెక్షన్స్ ఇలా నమోదు చేయాలి
Manchu Manoj: నేను ఒక్కడినే వస్తా.. నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్
నేను ఒక్కడినే వస్తా..నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
TGPSC: గ్రూప్- 2  ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల విండో ఓపెన్, అబ్జెక్షన్స్ ఇలా నమోదు చేయాలి
గ్రూప్- 2 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల విండో ఓపెన్, అబ్జెక్షన్స్ ఇలా నమోదు చేయాలి
Manchu Manoj: నేను ఒక్కడినే వస్తా.. నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్
నేను ఒక్కడినే వస్తా..నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్
Nara Lokesh: యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పక వస్తుంది - ఘాట్ వద్ద నారా లోకేష్
యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పక వస్తుంది - ఘాట్ వద్ద నారా లోకేష్
TTD April 2025 Tickets: తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!
తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!
ICC Champions Trophy: ఆ ప్లేయర్ టీనేజరేం కాదు.. బెంచ్ పై కూర్చోపెట్టి అవమానించొద్దు.. తప్పకుండా  ఆడించాల్సిందే
ఆ ప్లేయర్ టీనేజరేం కాదు.. బెంచ్ పై కూర్చోపెట్టి అవమానించొద్దు.. తప్పకుండా ఆడించాల్సిందే
Tirumala News: తిరుమలలో అపచారం, నిషేధిత ఆహార పదార్థాలతో వచ్చిన తమిళనాడు భక్తులు
తిరుమలలో అపచారం, నిషేధిత ఆహార పదార్థాలతో వచ్చిన తమిళనాడు భక్తులు
Embed widget