News
News
వీడియోలు ఆటలు
X

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

నటుడు సిద్దార్థ్ తో రిలేషన్ పై హీరోయిన్ అదితి రావు హైదరి మరోసారి క్లారిటీ ఇచ్చింది. తన పర్సనల్ విషయాల గురించి పట్టించుకోవడం మానేసి, సినిమాల గురించి అడిగితే బాగుంటుందని చెప్పుకొచ్చింది.

FOLLOW US: 
Share:

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. చాలా మంది హీరోయిన్స్ పై కొత్త కొత్తగా గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఆ హీరోయిన్ ప్రేమలో పడింది. ఆ హీరోతో రిలేషన్ లో ఉంది. ఇద్దరి మధ్య చెడింది. ఇలాంటి వార్తలు చాలా వినిపిస్తుంటాయి. వాటిని చాలా మంది నటీనటులు పట్టించుకోరు. మరికొంత మంది ఎప్పటికప్పుడు సదరు వార్తలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ సైతం తన రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె మరెవరో కాదు అదితి రావు హైదరి. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ రాణిస్తోంది. ఈమె కొంత కాలంగా హీరో సిద్దార్థ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ స్టార్స్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి.

మహాసముద్రం’ సినిమా నుంచి ప్రేమాయణం   

నిజానికి వీళ్లిద్దరు ‘మహాసముద్రం’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ ఏర్పడిందట. ఆ తర్వాత వీరి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లు పలుమార్లు మీడియాకు కనిపించారు. పార్టీ, పబ్బులో కలిసి తిరిగారు. పలు ఈవెంట్స్, ఫంక్షన్స్ లోనూ కలసి కనిపించారు. వీరిని చూసి త్వరతో పెళ్లి చేసుకోబోతున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. రీల్స్ చేస్తూ అలరిస్తున్నారు.

పర్సనల్ విషయాల గురించి మాట్లాడ్డం మానేస్తే మంచిది- అదితి రావు

ఇప్పటి వరకు వీరి రిలేషన్ షిప్ గురించి ఇటు అదితి రావు గానీ, అటు సిద్దార్థ్ గానూ ఓపెన్ గా చెప్పలేదు. తాజాగా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అదితి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడోద్దని చెప్పింది. వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందని వెల్లడించింది. నేను ఎవరితో రిలేషన్ పిప్ లో ఉన్నానో అవసరం లేదని చెప్పింది. ప్రస్తుతం తాను, చాలా సినిమాల్లో బిజీగా ఉన్నట్లు చెప్పింది. సినిమాల మీదే బాగా ఫోకస్ పెట్టినట్లు వెల్లడించింది. మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందే వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. దయచేసి తన పర్సనల్ విషయాలను పట్టించుకోకపోవడం మంచిదని చెప్పింది. వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టే వారికి మంచి సమాధానం చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సంజయ్ లీలా భన్సాలీ తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి’లో నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్న ఈ సిరీస్ లో,  పలువురు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు కనిపించి కనువిందు చేశారు. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ మహారాణుల మాదిరిగా దర్శనం ఇచ్చారు. 

View this post on Instagram
 
A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు

Published at : 23 Mar 2023 10:43 AM (IST) Tags: Siddharth Aditi Rao Hydari Relationship

సంబంధిత కథనాలు

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు