Dasara: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు
నాని నటిస్తున్న తాజా సినిమా ‘దసరా‘. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ‘దసరా‘ టీమ్ ‘సుమ అడ్డా‘ షోలో పాల్గొని సందడి చేసింది.
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ విడుదలకాబోతోంది. ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గా ఉంది. ఈ సినిమా తెలంగాణలోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
నాని ఆన్సర్స్ కు అందరూ షాక్!
అందులో భాగంగానే బుల్లితెర షో ‘సుమ అడ్డా‘లో ‘దసరా‘ టీమ్ పాల్గొన్నది. సుమ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్న షో ‘సుమ అడ్డా. ఈ షోకు నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు ‘దసరా’ చిత్ర బృందం వెళ్లింది. తాజాగా వీరికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.ఈ ప్రోమో తొలి నుంచి చివరి వరకు ఫన్నీ ఫన్నీగా సాగింది. ఫన్ తో పాటుగా సరదా ప్రశ్నలతో ఫుల్ ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. ‘‘మీకు మీ వైఫ్ కన్నా మీ అబ్బాయే ఎక్కువ ఇష్టం’’ అని సుమ అడగగా, అవును, కాదు అంటూ రెండు సమాధానాలు చెప్పారు నాని. వెంటనే షోలో నవ్వుల పువ్వులు పూశాయి. అటు తెలుగు ఇండస్ట్రీలో మీకు పోటీనిచ్చే హీరో లేడు అనగానే అవును అంటూ కామెంట్ చేశారు. వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఇక ‘దసరా‘ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి చెప్పమని అడగగా.. తాను అనుకున్నంత అద్భుతంగా సినిమా చేయలేదని చెప్పారు. ఈ సమాధానం విని అందరూ అవాక్కయ్యారు. ఈషోకు సంబంధించిన ఎపిసోడ్ మార్చ్ 25వ తేదీ ప్రసారం కానుంది.
ఈ నెల 30న పాన్ ఇండియన్ మూవీగా విడుదల
తొలి నుంచి ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ ట్రైలర్ లో ఊర మాస్ లుక్ లో నాని సరికొత్తగా కనిపించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈసినిమాను, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ నెల 30న అట్టహాసంగా విడుదల కాబోతుంది.
View this post on Instagram