News
News
వీడియోలు ఆటలు
X

No No No Lyrical Song: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సాంగ్ - మూడేళ్ల తర్వాత స్క్రీన్‌పై కనిపించిన అనుష్క, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఉగాది కానుకగా ఈ సినిమా నుంచి నోనోనో అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాజాగా నటిస్తోన్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. పి.మహేష్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. చాలా కాలం తర్వాత అనుష్క మళ్లీ గ్లామర్ రోల్ లో కనిపించనుండటంతో మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు  రివీల్ చేస్తూ సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ఫస్ట్ లుక్ లకు మంచి స్పందనే వచ్చింది. తాజాగా   ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు.   

ఆకట్టుకుంటున్న తొలి లిరికల్ సాంగ్

 నీ స్నేహం, నీ మోహం, నీ బంధం, అనుబంధం, ప్రేమించే సమయం లేదే, ప్రేమన్నా ప్రశ్నే లేదే,  సోలో లైఫ్‌ బెటర్‌ అంటూ స్టైలిష్‌గా సాగే ఈ సాంగ్  మ్యూజిక్‌ లవర్స్‌ ను ఆకట్టుకుంటోంది. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను ఎంఎం మానసి  ఆలపించారు. రాధన్‌ మ్యూజిక్‌  అద్భుతంగా, ఆకట్టుకొనేలా ఉంది. సినిమాపై తాజా లిరికల్ సాంగ్ మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

ఫుల్ ఖుషీలో అనుష్క ఫ్యాన్స్

సుమారు 3 ఏళ్ల తర్వాత మళ్లీ అనుష్క తెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అనుష్క కూడా ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి ఆమె ఆశలన్నీ ఈ మూవీపైనే ఉన్నాయి. ‘నిశ్శబ్దం’  లాంటి సినిమా తర్వాత తనకు తన ఇమేజ్ కు తగిన స్క్రిప్ట్ రావడంతో ఈ సినిమాకు ఓకే చెప్పింది స్వీటీ. అనుష్క ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మహేష్.

View this post on Instagram
 
A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

సినిమాపై అంచనాలు పెంచేసిన లిరికల్ సాంగ్

ఇప్పటికే లిరికల్ సాంగ్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  వాట్సాప్ లో చాట్ చేస్తూ సాంగ్ లోని కొన్ని లిరిక్స్ ను విడుదల చేశారు. ఇది చూడగానే పెప్పీ డాన్స్ నంబర్ సాంగ్ లాగా అనిపించింది. #MSMP పేరుతో ఉన్న వాట్సాప్‌ చాటింగ్ ద్వారా సరికొత్తగా ఫస్ట్‌ సింగిల్‌ ను విడుదల చేసి మూవీపై మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. ఇక ఈ చిత్రం పై ఇటు ఇండస్ట్రీతో పాటు అటు ప్రేక్షకుల్లోనూ భారీగానే అంచనాలు ఉన్నాయి.

త్వరలో విడుదల తేదీ ప్రకటన

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మిస్తోంది.  ఈ బ్యానర్ లో అనుష్క ఇప్పటికే ‘భాగమతి’ సినిమా చేసింది.  ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. ఇక హీరో నవీన్ పొలిశెట్టి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు నవీన్. ‘జాతీ రత్నాలు’ తర్వాత  కొంత గ్యాప్ తీసుకున్న నవీన్ మరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Read Also: ‘అన్న దిగిండు’ అంటూ అనిల్ రావిపూడి క్రేజీ అప్ డేట్ - బాలయ్య ఫస్ట్ లుక్, పోలే అదిరిపోలే!

Published at : 22 Mar 2023 04:03 PM (IST) Tags: Naveen Polishetty Anushka Mahesh Babu P No No No Lyrical Song Miss Shetty Mr Polishetty Movie

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?