By: ABP Desam | Updated at : 22 Mar 2023 10:40 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@AnilRavipudi/twitter
‘వీరసింహారెడ్డి’ సినిమాతో సంక్రాంతి బరిలో దిగి అదిరిపోయే హిట్ కొట్టాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే ఊపులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. #NBK108 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తారకరత్న మరణం కారణంగా కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఉగాది పండుగ నాడే బాలయ్య అభిమానులకు పండగ లాంటి అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అభిమానుల్లో ఆనందం నింపారు. “అన్న దిగిండు, ఈసారి మీ ఊహకు మించి” పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
అన్న దిగిండు 🔥
— Anil Ravipudi (@AnilRavipudi) March 22, 2023
ఈసారి మీ ఊహకు మించి😎
అందరికీ ఉగాది శుభాకాంక్షలు 🤗
Here’s the First Look of Natasimham #NandamuriBalakrishna garu from #NBK108 💥#NBKLikeNeverBefore @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/dYa3CGi5OF
బాలయ్య అభిమానులకే పండగే పండుగ!
ఇక ఇప్పటికే #NBK108కు సంబంధించి ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. అయితే, నందమూరి తారకర్న గుండెపోటుకు గురికావడం, ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోవడంతో వాయిదా పడింది. కొంతకాలం పాటు షూటింగ్ కు విరామం ప్రకటించారు బాలయ్య. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు, బాలయ్య లేకుండా చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. బాలయ్య లుక్ రివీల్ చేశారు.
షూటింగ్ లో జాయిన్ అయిన కాజల్!
తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ జాయిన్ అయింది. పెళ్లి తర్వాత కాజల్ పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో చేస్తోన్న ‘ఇండియన్ 2’ మూవీలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తోంది. బాలయ్య, కాజల్ అగర్వాల్ కూతురిగా ఆమె కనిపించనుంది. ఇప్పటికే ఈమెపై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. జైలుకు వెళ్లొచ్చిన తండ్రి కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న #NBK108
ఇప్పటి వరకు సీమాంధ్ర ప్రాంతంలో ఆయన సినిమాలు తెరకెక్కగా, తొలిసారి తెలంగాణ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. ‘నిప్పురవ్వ’ సినిమా తర్వాత మరోసారి తెలంగాణ బేస్ గా జరిగే కథలో ఆయన నటించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే సీన్లు పూర్తి స్థాయిలో ఎమోషన్స్ తో నిండి ఉంటాయట. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
బాలయ్య తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను చేశారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, హనీరోజ్ కీలకపాత్ర పోషించింది.
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు