Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
నాని నటిస్తున్న తాజా సినిమా ‘దసరా’. ఈ చిత్రాన్నికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది టీమ్.
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ విడుదలకాబోతోంది. ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గా ఉంది. ఈ సినిమా తెలంగాణలోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ముంబైలో వడాపావ్ తిన్న నాని!
‘దసరా’ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగానే అన్ని భాషల్లో ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు చిత్ర బృందం సభ్యులు. తాజాగా ముంబైలో ఈ సినిమా ప్రమోషన్ జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న నాని, స్ట్రీట్ ఫుడ్ వడా పావ్ తిని సందడి చేశారు. ప్రమోషనల్ ఈవెంట్ జరిగే సమీపంలో ఉన్న ఓ వీధి వ్యాపారి దగ్గర సినిమా యూనిట్ మెంబర్స్ వడాపావ్ తింటూ కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి నాని కొత్తగా ప్రయత్నిస్తున్నారు. విద్యాసంస్థల్లో స్టూడెంట్స్ ను కలిసి మాట్లాడ్డంతో పాటు, స్పోర్ట్స్ ఈవెంట్ లోనూ పాల్గొని ‘దసరా’కు మంచి ప్రచారం కల్పిస్తున్నారు.
View this post on Instagram
సినిమాపై అంచనాలు పెంచిన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్
తొలి నుంచి ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ ట్రైలర్ లో ఊర మాస్ లుక్ లో నాని సరికొత్తగా కనిపించాడు. గతంలో ఎప్పడూ చూడని నానిని ఈ ట్రైలర్ లో చూపించారు. కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది. అదిరిపోయే ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులు ‘దసరా’ సినిమాలో నాని ధరణిగా నటిస్తున్నాడు. హీరో, హీరోయిన్లు పూర్తి స్థాయిలో డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా హింసతో చెలరేగిపోయాడు నాని. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ ‘చిత్తు చిత్తుల గుమ్మ’ అంటూ బతుకమ్మ పాటతో ప్రారంభమైంది. హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి కూతురు గెటప్ లో కనిపించింది. కీర్తి సురేష్ నటన, నాని ఫైట్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ నెల 30న పలు భాషల్లో విడుదల
మార్చి 30న పలు భాషల్లో ‘దసరా’ విడుదల పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈసినిమాను, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ నెల 30న అట్టహాసంగా విడుదల కాబోతుంది.
Superstar Nani with Sharad Kelkar enjoy Vada pav in Mumbai pic.twitter.com/2sP7Z9ozuE
— Sharmila Maiti (@sharmilamaiti) March 21, 2023
Read Also: దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, బోటులో రొమాంటిక్ ట్రిప్ - ఆ వార్తలకు పుల్‌స్టాప్!