News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Shalini Ajith Kumar: దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, బోటులో రొమాంటిక్ ట్రిప్ - ఆ వార్తలకు పుల్‌స్టాప్!

అజిత్, షాలిని దంపతులు దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిల్లతో కలిసి హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రావడం విశేషం.

FOLLOW US: 
Share:

జిత్ కుమార్, షాలిని దంపతుల గురించి పెద్దగా పరిచయం అససరం లేదు. తమిళ నాట మోస్ట్ బ్యూటిపుల్ సినీ కపుల్స్. ఇక హీరోగా అజిత్ క్రేజ్ మామూలుగా ఉండదు. తమిళంలోనే కాదు, సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇంటర్వ్యూలు, ప్రమోషన్లకు ఆయన చాలా దూరంగా ఉంటారు. ఎలాంటి వివాదాల జోలికిపోరు. ఆయన గురించి కొద్ది రోజులుగా ఓ వార్త వైరల్ అవుతోంది. తన భార్య షాలినితో విడిపోనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి.

దుబాయ్ లో షికారు చేస్తున్న అజిత్ దంపతులు

ఎప్పటికప్పుడు ఆ వార్తలు అవాస్తవాలేనని సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్తున్నారు అజిత్ దంపతులు. తాజాగా మరోసారి ఈ ఊహాగానాల్లో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం దుబాయ్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నారు. భర్తతో కలిసి బోటులో రొమాంటిక్ గా షికారు చేస్తున్న ఫోటోలను షాలిని ఇన్ స్టాలో షేర్ చేశారు. పిల్లలతో కలిసి సరదాగా గడిపే ఫోటోలను సైతం ఆమె నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  

View this post on Instagram
 
A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)

2000లో అజిత్, షాలిని వివాహం

హీరో అజిత్ హీరోయిన్ షాలినిని చాలా కాలం క్రితమే పెళ్లాడారు.  మాధవన్ నటించిన ‘సఖి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రంలో బాలనాటిగా అలరించింది. తెలుగు వారికి సుపరిచితురాలు అయిన షాలిని అజిత్ పెళ్లి చేసుకున్నాడు. 2000లో అజిత్, షాలిని వివాహం జరిగింది.  వీరికి ఇద్దరు పిల్లలు. అనౌష్క, ఆద్విక్. ఎంతో కాలంగా అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్న వీరి గురించి కొద్ది కాలంగా విడాకులు తీసుకుంటారనే రూమర్ తెగ హల్చల్ చేస్తోంది. దీంతో వీరిద్దరి అభిమానులు చాలా ఆందోళన చెందారు. వాటన్నింటికి షాలిని ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తన భర్తతో పాటు పిల్లలతో కూడిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఈ ఫోటోలో చూసి అభిమానులు సంతోష పడుతున్నారు. వీరిద్దరూ విడిపోయే అవకాశం లేదని కామెంట్లు పెడుతున్నారు.

#AK62 సినిమాలో బిజీ

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘తునివు’ మంచి విజయాన్ని అందుకుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ ‘వారిసు’తో పోటీగా సంక్రాంతి బరిలో దిగింది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ‘తునివు’ సినిమాలో మంజు వారియర్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం తన 62వ సినిమా పనుల్లో అజిత్ బిజీగా ఉన్నారు. మగిజ్ తిరుమేనిని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలుత ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.  

View this post on Instagram
 
A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)

Read Also: ‘ఉగాది’ To ‘దసరా’ - పండుగల టైటిల్స్‌తో సినిమాలు, మరి హిట్ కొట్టాయా?

Published at : 21 Mar 2023 02:49 PM (IST) Tags: Shalini Ajith Kumar Dubai Vacation romantic pictures

ఇవి కూడా చూడండి

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

Gruhalakshmi September 22nd: జానూకి దివ్య వార్నింగ్ - ఎప్పుడూ తన పక్కనే ఉండాలని తులసిని కోరిన నందు

Gruhalakshmi September 22nd: జానూకి దివ్య వార్నింగ్ - ఎప్పుడూ తన పక్కనే ఉండాలని తులసిని కోరిన నందు

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

టాప్ స్టోరీస్

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కుస్తీ, ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కుస్తీ, ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్

IND vs AUS: మొహాలీని మోతెక్కించేదెవరు? - నేడే భారత్, ఆసీస్ తొలి వన్డే

IND vs AUS: మొహాలీని మోతెక్కించేదెవరు? -  నేడే భారత్, ఆసీస్ తొలి వన్డే