By: ABP Desam | Updated at : 21 Mar 2023 12:42 PM (IST)
Edited By: anjibabuchittimalla
Images Credit: Social Media
పండగలు అనగానే అందరిలో సంతోషం కనిపిస్తుంది. బంధువులు, మిత్రులు, అంతా కలిసి పండుగలు జరుపుకుంటూ హ్యాపీగా జాలీగా గడుపుతారు. తెలంగాణలో దసరా పండుగ బాగా జరుపుకుంటారు. ఏపీలో సంక్రాంతి సంబురంగా జరుపుకుంటారు. ఇక ఉగాదిని ఇరు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా జరుపుకుంటారు. పండగ ఏదైనా పండుగే. అన్ని ప్రాంతాాల్లో అందరి ఇళ్లల్లో సంతోషాలను వెల్లి విరిసేలా చేస్తాయి. అందరిలో ఆహ్లాదాన్ని నింపుతాయి. అలాగే పండుగల పేరుతో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇంతకీ ఆసినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఉగాది
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉగాది’. 1997 లో ఫ్యామిలీ డ్రామాగా విడుదలై మంచి టాక్ సంపాదించింది. ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం అందించారు. పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి.
2. విజయ దశమి
తమిళ సినిమా ‘శివకాశి’కి రీమేక్ గా వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమాకి తెలుగులో ‘విజయ దశమి’ అనే టైటిల్ పెట్టారు. వి సముద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.
3. రాఖీ
కృష్ణవంశీ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి చేసిన సినిమాకి ‘రాఖీ’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న హింస, గృహహింసను చూపించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది.
4. సంక్రాంతి
ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ కలిసి చేసిన సినిమా ‘సంక్రాంతి’. మంచి ఫ్యామిలీ డ్రామాతో శివ ముప్పలనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది.
5. కృష్ణాష్టమి
‘జోష్’ సినిమా ఫేమ్ వాసు వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో సునీల్ హీరోగా చేశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.
6. భోగి మంటలు
విజయ నిర్మల డైరెక్ట్ చేసిన ‘భోగి మంటలు’ సినిమా 1981 లో రిలీజ్ అయ్యింది. కృష్ణ హీరోగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది.
7. హోలీ
ఉదయ్ కిరణ్, ‘నువ్వే కావాలి’ హీరోయిన్ రిచా కలిసి చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హోలీ’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.
8. దీపావళి
తమిళంలో జయం రవి, భావన ప్రధాన పాత్రల్లో నటించిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రానికి ‘దీపావళి’ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది.
10. దుర్గాష్టమి
కన్నడలో మహాలక్ష్మి, వజ్రముని, సత్యప్రియ, చేతన్‌రాజ్ లాంటి ప్రముఖ కన్నడ నటులు ‘థో దుర్గాష్టమి’ అనే భక్తిరస చిత్రం చేశారు. ఈ చిత్రం కూడా మంచి కలెక్షన్స్ సాధించింది.
8. దసరా
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ చేస్తున్న తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీకి ‘దసరా’ అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుంది.
Read Also: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్ ఇచ్చిన కృష్ణ!
‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Jamal Kudu Song: బాబీడియోల్ ‘జమల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
/body>