News
News
X

Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్ అయోధ్యలో రిలీజ్ చేస్తారట! సీఎం యోగి కూడా వస్తారట? - ఇంట్రెస్టింగ్ గాసిప్

Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్‌ను అయోధ్యలో లాంచ్ చేస్తారన్న వార్త చక్కర్లు కొడుతోంది.

FOLLOW US: 
Share:

Adipurush Teaser Update: 

ఆ రోజే టీజర్ లాంఛ్..? 

బాహుబలి తరవాత ప్రభాస్ (Actor Prabhas) ప్యాన్ ఇండియా యాక్టర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీవే. లైనప్ అంతా భారీ బడ్జెట్ సినిమాలతో నిండిపోయింది. ఈ లైనప్‌లో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆదిపురుష్. ఇప్పటికే హిందుత్వ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలకు హైప్ పెరిగిపోయింది. కశ్మీర్ ఫైల్స్, RRR,ఆ తరవాత కార్తికేయ-2. బాలీవుడ్‌ను షేక్ చేశాయి ఈ మూడు సినిమాలు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) మూవీపైనా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్స్‌ ఈ సినిమా నుంచి రాలేదు. ప్రభాస్ అభిమానులంతా ఆయన ఫస్ట్‌ లుక్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీన ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడిదే మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కూడా వైరల్ అవుతోంది. ఆదిపురుష్ టీజర్‌ (Adipurush Teaser)ను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చూస్తోందట 
మూవీ యూనిట్. దీనికోసం వేదిక కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఎక్కడో తెలుసా..? అయోధ్యలో. రామాయణం కథతో వస్తున్న సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ఇంతకన్నా మంచి వేదిక ఇంకేముంటుంది అని అనుకుంటున్నారట. అందుకే...అక్కడే ఈ ఈవెంట్ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. 

సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తారా? 

దసరా రోజు సాయంత్రం అయోధ్యలో చాలా గ్రాండ్‌గా టీజర్‌ లాంఛ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. మరో ఆసక్తికర అప్‌డేట్ ఏంటంటే..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వస్తారనీ టాక్ వినిపిస్తోంది. ఆయన చేతుల మీదుగానే ఆదిపురుష్ టీజర్‌ను లాంఛ్ చేయిస్తారట. దసరా నాటికి కృష్ణంరాజు 13వ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. అంటే...ప్రభాస్‌కు మూవీ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టేందుకు టైమ్ దొరుకుతుంది. అందుకే...అదే రోజు సాయంత్రం ఈ ఈవెంట్‌ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ కచ్చితంగా ఈ ఈవెంట్‌కు వస్తారనీ అంటున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ నటిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌ కోసం భారీగానే ఖర్చు చేశారట. ముందు నుంచి దీన్నో ఐ ఫీస్ట్ మూవీగానే ప్రమోట్ చేస్తోంది టీమ్. చాన్నాళ్లుగా ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న  బాలీవుడ్‌కి ఇది కొత్త ఎనర్జీ ఇస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

వరుస అప్‌డేట్‌లు..

జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. ఇకపై వ‌రుస‌గా 'ఆదిపురుష్‌'కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర‌బృందం భావిస్తోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఫారెన్ లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు రూ.250 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే.. పెట్టిన బడ్జెట్ లో సగమన్నమాట. డిజిటల్ రైట్స్ తోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి!

Also Read: Avatar Movie Re-release: అవతార్ రీరిలీజ్ కాపీ చూసి ఆశ్చర్యపోయాం, అంతకు మించి ఉంటుంది - డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కామెంట్స్

Published at : 22 Sep 2022 05:37 PM (IST) Tags: CM Yogi Adipurush First Look Actor prabhas Adipurush Teaser Adipurush Teaser Launching Ayodhya

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం