Avatar Movie Re-release: అవతార్ రీరిలీజ్ కాపీ చూసి ఆశ్చర్యపోయాం, అంతకు మించి ఉంటుంది - డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కామెంట్స్
Avatar Movie Re-release: అవతార్ రీరిలీజ్‌పై డైెరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Avatar Movie Re-release:
4K రిజల్యూషన్‌లో..
ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి విడుదల చేస్తూ సినీ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పుడు విజువల్ వండర్ అవతార్ కూడా మరోసారి విడుదల కానుంది. రెండు నెలల్లో సీక్వెల్ విడుదల కానుండగా...ఫస్ట్ పార్ట్‌ను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దీనిపై...అవతార్ డైరెక్టర్ జేమ్ కామెరూన్ స్పందించారు. తాను కూడా రీరిలీజ్‌పై చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పారు. 2009లో విడుదలైన అవతార్ ఫస్ట్ పార్ట్ అప్పట్లో ఓ సెన్సేషన్. అప్పుడు 3Dలో రిలీజ్ అయిన ఈ మూవీని రీమాస్టరింగ్ చేసి 4Kలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. "అవతార్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి 12 ఏళ్లవుతోంది. అప్పట్లో పాతికేళ్ల లోపు ఉన్న వాళ్లు ఈ సినిమాని చూసే ఉంటారు. కానీ...థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ పెద్దగా తెలిసి ఉండదు. అందుకే... బిగ్‌స్క్రీన్‌కు తగ్గట్టుగా ఈ మూవీని రీమాస్టరింగ్ చేశాం. 4K రిజల్యూషన్‌లో విడుదల చేస్తున్నాం" అని కామెరూన్ వెల్లడించారు. 12 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను అప్పట్లోనే ఓ విజువల్ వండర్ అని తెగ పొగిడేశారంతా. ఈ రీరిలీజ్ కాపీ అంతకు మించి అద్భుతంగాఉంటుందని అంటున్నారు డైరెక్టర్. "మూవీ అంతకు ముందు కన్నా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. ఆ మూవీ కొత్తగా చూడాలను కుంటున్నారు వాళ్లెంతో మంది ఉన్నారు. రీమాస్టరింగ్ అయ్యాక ఈ మధ్యే నేను సినిమా చూశాను. అవి చూసి మేం ఆశ్చర్యపోయాం" అని అన్నారు. రీమాస్టరింగ్ కాపీని చూసి చాలా ఇంప్రెస్ అయ్యామని చెబుతున్నారు జేమ్స్ కామెరూన్.
అవతార్ -2 కూడా విజువల్ వండరే..
ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అవతార్ రికార్డు 12 ఏళ్లు గడిచినా ఇంకా చెక్కు చెదరలేదు. సీక్వెల్ అనౌన్స్ చేయగానే సోషల్ మీడియా ఊగిపోయింది. మొత్తం నాలుగు సీక్వెల్స్ రాబోతున్నట్లు ప్రకటించారు. రెండో సీక్వెల్ కి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' అనే టైటిల్ పెట్టారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను 'డాక్టర్ స్ట్రేంజ్' మూవీ థియేటర్లలో ప్లే చేశారు. ఇప్పుడు నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ముందుగా పండోరా గ్రహానికి సంబంధించిన స్టన్నింగ్ విజువల్స్‌తో ట్రైలర్ మొదలైంది. పండోరాలోని అద్భుతమైన లొకేషన్లు, చూడగానే మైమరపించే నీలి రంగులోని సముద్రాన్ని తర్వాత చూపిస్తారు. అక్కడ నుంచి సినిమా పేరును జస్టిఫై చేస్తూ విజువల్స్ అండర్ వాటర్‌లోకి వెళ్తాయి. హీరో శామ్ వర్తింగ్‌టన్ చేసిన జేక్ సల్లీ, హీరోయిన్ జో సల్దానా 'నేతిరి' పాత్రలకు సంబంధించిన కొత్త క్లోజప్ షాట్లను ఇందులో చూడవచ్చు. అయితే ఈ సినిమా గురించి ఇంకా తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇందులో కథేంటి అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 కూడా విడుదల కానున్నాయి.