By: ABP Desam | Updated at : 06 Jul 2023 10:02 AM (IST)
ప్రియాంక చోప్రా(Photo Credit: Priyanka Chopra/Instagram)
కొంత మందికి ఉన్నత స్థాయికి చేరిన తర్వాత తాము నడిచి వచ్చిన దారిని మర్చిపోతారు. ఏ స్థాయి నుంచి వచ్చామనే విషయాన్ని గుర్తు పెట్టుకోరు. పైగా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు హాలీవుడ్ లో రాణిస్తున్న టి ప్రియాంకా చోప్రా పరిస్థితి సైతం అలాగే ఉంది. దక్షిణాది సినిమాలో సినీ కెరీర్ మొదలు పెట్టిన ఆమె, బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత హాలీవుడ్ లోకి అడుగు పెట్టుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా రాణిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
తాజాగా ప్రియాంకా చోప్రాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది పాత వీడియో అయినా, అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారతీయ సినిమాలను కించపరుస్తూ ఆమె ఈ వీడియోలో దారుణ వ్యాఖ్యలు చేసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 2016లో ఎమ్మి అవార్డుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రియాంకా చోప్రా పాల్గొన్నది. అవార్డుల వేడుక అనంతరం బయకు వచ్చిన ప్రియాంకను భారతీయ సినిమాలను గురించి చెప్పాలని ఓ అంతర్జాతీయ మీడియా రిపోర్టర్ అడుగుతుంది. దీంతో ఆమె ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చీప్ కామెంట్స్ చేసింది. ఏమాత్రం తడుముకోకుండా “భారతీయ సినిమాల్లో హిప్స్, B**bs తప్ప ఇంకేమీ ఉండవు” అని చెప్పింది. అంటే, కేవలం అంగాంగ ప్రదర్శన చేయడం తప్ప ఇంకేం ఉండదనే రీతిలో ఆమె మాట్లాడింది.
In an Old video,from Emmy awards in 2016 Priyanka Chopra was asked by a reporter to show some indian movies dance moves. PeeCee than said Indian movies is are all about “ Hips and Boobs”.
by u/Left_Bee5657 in BollyBlindsNGossip
బాలీవుడ్‌లో నటిగా జీవితాన్ని ప్రారంభించి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా తనకు నటిగా జన్మనిచ్చిన భారతీయ సినిమాలపై చేసిన విమర్శలను నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మాటలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. “భారత చలనచిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని తెలుసు. కానీ, అంతర్జాతీయ వేదికపై భారతీయ పరిశ్రమ గురించి ఆమె మాట్లాడిన విధానం చాలా బాధపెట్టింది” అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “భారత చలనచిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ వేదికపై ఇలా చీప్‌గా మాట్లాడటం దారుణం. ఆమెను ఇండియన్ సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలి” అని మరో నెటిజన్ తెలిపాడు.
వాస్తవానికి ప్రియాంక భారతీయ సినీ పరిశ్రమ గురించి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో పాతదే అయినా, ఇటీవల ఆమె నటించిన హాలీవుడ్ సిరీస్ 'సిటడెల్' విడుదల కావడంతో, ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ప్రియాంక పేరు ట్రెండింగ్ అయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు 2016 నాటి ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడినా, తను మాట్లాడిన విధానం చాలా తప్పుగా ఉందని పలువురు సినీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు.
Read Also: ప్రభాస్ ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చే యాక్షన్ - 'సలార్' టీజర్ వచ్చేసిందోచ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Naga Panchami December 7th Episode మోక్షతో పంచమి చివరి మాటలు.. మృత్యుంజయ యాగం జరిపించనున్న సప్తరుషులు!
Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ
Jagadhatri December 7th Episode: సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు చేసిన ధాత్రి.. తెలివిగా బూచిని ఇరికించేసిన కేదార్, ధాత్రి!
‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
/body>