Hansika-Sohail Wedding: అట్టహాసంగా హన్సిక వివాహ వేడుక, సోహెల్‌తో ఏడడుగులు
అందాల తార హన్సిక పెళ్లి వేడుకల అంగరంగ వైభవంగా జరిగింది. తన ప్రియుడు సోహెల్ ను సింధ్ ఆచారం ప్రకారం వివాహం చేసుకుంది. జైపూర్ లో జరిగిన ఈ వివాహ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని, తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ కతురియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆదివారం నాడు (డిసెంబర్ 4న) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. జైపూర్ సమీపంలోని ముందోటా ఫోర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
అట్టహాసంగా వెడ్డింగ్
హన్సిక, సోహైల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. హన్సిక తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత బాణాసంచా వెలుగుల్లో పెళ్లి వేదికపైకి ఎంట్రీ ఇచ్చింది. రాజసం ఉట్టిపడేలా నడుచుకుంటూ వస్తున్న హన్సిక వీడియో ఆకట్టుకుంటోంది. హన్సిక, సోహెల్ సింధీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తూ కనువిందు చేశారు.
View this post on Instagram
View this post on Instagram
హన్సిక మోత్వాని, సోహెల్ కతురియాల ప్రీ వెడ్డింగ్ వేడుక సైతం కలర్ ఫుల్ గా జరిగింది. ఆదివారం ఉదయం, హన్సిక తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి హల్దీ వేడుక జరుపుకుంది. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు నూతన వధూవరుల ముఖాలపై పసుపు రాసి వేడుక జరిపారు. వాస్తవానికి డిసెంబర్ 2 సూఫీ నైట్ తో వీరి వివాహ వేడుక మొదలైంది. 3న మెహందీ, సంగీత్ నిర్వహించారు. హన్సిక సంగీత్ లో గులాబీ రంగు లెహంగా ధరించి అందంగా కనిపించింది. అయితే సోహెల్ తన నలుపు రంగు షేర్వాణీ ధరించాడు. 4న ఉదయం హల్దీ వేడుక నిర్వహించారు. సాయంత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యింది. ప్రీ వెడ్డింగ్ పార్టీలో భాగంగా హన్సిక, సోహైల్ డ్యాన్సుతో ఆట్టుకున్నారు. ఆయా భాషలకు చెందిన పాపులర్ పాటలకు స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ప్రీ వెడ్డింగ్ పార్టీ కోసం, వధువు, వరుడు తెల్లటి దుస్తులు ధరించి కనువిందు చేశారు.
View this post on Instagram
View this post on Instagram
వరుస సినిమాలతో బిజీ బిజీ
ఇక హన్సిక సినిమాల గురించి మాట్లాడుకుంటే, బాలనటిగా కెరీర్ మొదలు పెట్టింది. తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నార్త్ తో పాటు సౌత్ లోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హన్సిక ‘పార్ట్ నర్’, ‘105 మినిట్స్’ సినిమాలతో పాటు తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.
Read Also: ‘జబర్దస్త్’ పవిత్ర ఇల్లు చూశారా? నాన్న లేరు, ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే, ఆ నవ్వుల వెనుక ఎంత బాధ!