Jabardast Pavithraa: ‘జబర్దస్త్’ పవిత్ర ఇల్లు చూశారా? నాన్న లేరు, ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే, ఆ నవ్వుల వెనుక ఎంత బాధ!
‘జబర్దస్త్’ షో ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. అలా ‘జబర్దస్త్’ షోలో అడుగు పెట్టి సత్తా చాటుకుంది పవిత్ర. ప్రస్తుతం మంచి లేడీ కమెడియన్ గా కొనసాగుతోంది.
తెలుగు బుల్లితెరపై సూపర్ డూపర్ కామెడీ షోగా గుర్తింపు పొందింది ‘జబర్దస్త్’ షో. ఈ షో ఉభయ తెలుగు రాష్ట్రాల టీవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. తొలుత ఈ షోలో మగవాళ్లే ఆడవారిగా వేషాలు వేసుకుని స్కిట్స్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు లేడీ కమెడియన్స్‌కు కూడా అవకాశాలు దక్కుతున్నాయి. పురుషులతో పోటీగా నవ్విస్తున్నారు. ఐశ్వర్య, సత్య, ఫైమా, వర్ష, రోహిణి, రితూ సహా పలువురు అమ్మాయిలు ‘జబర్దస్త్’లో సక్సెస్ అయ్యారు. వీరిలో పలువురు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు.
టిక్ టాక్ టు ‘జబర్దస్త్’
పవిత్ర చాలా తక్కువ సమయంలోనే ‘జబర్దస్త్’ వేదికపై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటోంది. భాస్కర్, హైపర్ ఆది, వెంకీ, రాఘవ టీమ్స్ లో పవిత్ర కనిపిస్తోంది. ప్రస్తుతం ‘జబర్దస్త్’లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న పవిత్ర సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ‘టిక్ టాక్’లో పాగల్ పవిత్రగా హల్ చల్ చేసింది. చివరికి ఆ వీడియోలే ఆమెకు ‘జబర్దస్త్’లో అవకాశాలను ఇచ్చాయి. బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో చేసినా రాని గుర్తింపును పవిత్ర ‘జబర్దస్త్’ ద్వారా సంపాదించుకుంది.
‘జబర్దస్త్’ స్టేజి మీద నవ్వుల పువ్వులు పూయించే ఈ అమ్మాయి జీవితం చాలా సమస్యలతో నిండిపోయింది. ఏడాది క్రితం తన తండ్రి చనిపోయాడు. తల్లి తన ఊళ్లో ఉంటుంది. తనకు ఉన్న బ్యూటీ సెలూన్ ను అమ్మేసి ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇల్లు వాస్తుకు లేకపోవడంతో తాజాగా కొన్ని మరమ్మతులు చేయిస్తోంది. తాజాగా తన ఇంటికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ ద్వారా షేర్ చేసింది.
పాత ఇంటికి మరమ్మతులు
చాలా పాత ఇల్లును కొనుగోలు చేసి, దానికి కొత్త మెరుగులు అద్దుతోంది పవిత్ర. ఆ వీడియోను ఇటీవల తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసింది. ముందుగా పవిత్ర తన తల్లితో కలిసి తండ్రి చిత్ర పటానికి నివాళులర్పించింది. ఆ తర్వాత తమ ఇంట్లో జరుగుతున్న పనుల వివరాలను వీడియోలో చూపించింది. మామూలుగా ఉన్న ఇల్లును, తమ అభిరుచులకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేయిస్తున్నట్లు తెలిపింది. కొన్ని గోడలు కూల్చి, కొత్తగా కట్టిస్తున్నానని పేర్కొంది. పనులన్నీ పూర్తయితే పాత ఇల్లు కొత్తగా మెరిసిపోతుందని చెప్పింది పవిత్ర. పవిత్ర వీడియోను చూసిన నెటిజన్లు చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి లేకపోయినా, ఆయన బాధ్యతలను తీసుకుని ఇల్లు కట్టిస్తున్నందుకు అభినందనలు చెప్తున్నారు. త్వరలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసి, అమ్మను చక్కగా చూసుకోవాలని కోరుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
పవిత్ర సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని సోమశిల. ఇటీవలే ప్రగతి i20 కారు కొనుగోలు చేసి అమ్మను సర్‌ప్రైజ్ చేసింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
Read Also: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది