News
News
X

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది

సమంతపై ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు సినిమా పరిశ్రమలో 'తర్వాతి మహానటి'గా అభివర్ణించారు. ఈ కాంప్లిమెంట్స్ పై సమంత స్పందించింది.

FOLLOW US: 
Share:

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటిగా సత్తా చాటుతోంది. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనంతట తానుగా ఎదిగింది. సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  తన అద్భుత నటనతో ప్రేక్షకులను మాత్రమే కాదు, నిర్మాతల అభిమానాన్నిదక్కించుకుంది. తెలుగు సినిమాను సమంతా ఏలబోతోందనే ప్రశంసలు పొందుతోంది. తాజాగా NBK 2 షో అన్‌స్టాపబుల్‌లో టాలీవుడ్ బడా నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంతపై  ప్రశంసలు కురిపించారు.

సమంతపై బడా నిర్మాతల ప్రశంసలు

టాలీవుడ్ లో తర్వాతి  మహానటి ఎవరు? అని బాలకృష్ణ అడిగారు.  నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'తదుపరి మహంతి' అయ్యే సత్తా ఉన్న ఏకైక నటి సమంత అని వెల్లడించారు. ఆమె నటన చాలా నేచేరల్ గా అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సమంత కూడా స్పందించారు.  లెజెండరీ నిర్మాతల నుంచి చక్కటి కాంప్లిమెంట్‌ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.  1950 నుంచి  70వ దశకం ప్రారంభం వరకు సావిత్రి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగింది. అప్పట్లోనే హీరోలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఎక్కువ అత్యధిక పారితోషకం అందుకునే వారు. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. అందుకే తనను ‘మహానటి’గా గుర్తించారు.

క్రిస్మస్ వేడుకలు షురూ

సమంత క్రిస్మస్ వేడుకలను మొదలు పెట్టింది. తన పెంపుడు కుక్క సాషాతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభించింది. తన ఇంట్లో క్రిస్మస్ ట్రీతో ఉన్న సాషా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వరుస సినిమాలు చేస్తున్న సమంత

సమంత తాజాగా పాన్ ఇండియన్ మూవీ ‘యశోద’తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన కెరీర్ లో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ అనే పౌరాణిక చిత్రంలో ఆమెనటిస్తోంది. ఈ సినిమాలో దేవ్ మోహన్‌తో పాటు యువరాణి శకుంతలగా కనిపించనుంది. అల్లు అర్హ, మోహన్ బాబు సహా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  అటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కుషి’ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఇందులో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు.  రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సిటాడెల్‌’లో వరుణ్  ధావన్ తో కలిసి నటిస్తోంది. అటు ‘అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ మూవీలోనూ నటిస్తోంది.

Read Also: RRR నటి ఒలివియా నటించిన వెబ్ సీరిస్ ‘ది హెడ్’ రిలీజ్‌కు రెడీ - కానీ, ఒక బ్యాడ్ న్యూస్!

Published at : 04 Dec 2022 11:24 AM (IST) Tags: suresh babu Allu Aravind Samantha Ruth Prabhu Next Mahanati

సంబంధిత కథనాలు

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

K Viswanath Death: సెల్యూట్ టు మాస్టర్ - కళాతపస్వికి కమల్, బాలకృష్ణ, అనిల్ కపూర్ నివాళులు

K Viswanath Death: సెల్యూట్ టు మాస్టర్ - కళాతపస్వికి కమల్, బాలకృష్ణ, అనిల్ కపూర్ నివాళులు

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K Vishwanath Top 10 Movies: విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే - గుండె బరువెక్కిస్తాయ్, మనసును హత్తుకుంటాయ్!

K Vishwanath Top 10 Movies: విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే - గుండె బరువెక్కిస్తాయ్, మనసును హత్తుకుంటాయ్!

టాప్ స్టోరీస్

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?