By: ABP Desam | Updated at : 02 Dec 2022 11:54 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Jorge_Dorado_/twitter
RRRలో బ్రిటీష్ యువతిగా ఆకట్టుకున్న ఒలివియాను సినీ ప్రేమికులు అంత ఈజీగా మరిచిపోలేదు. ఎందుకంటే.. ఆమె అభినయం అంతగా కట్టిపడేసింది. ఆ సినిమాకు ఆమె పాత్ర కూడా ఒక ప్లస్ పాయింట్. RRRలో ఆమె నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు ఆమె నటించిన సినిమాలు గురించి కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే, ఆమె త్వరలో ‘ది హెడ్’ అనే వెబ్ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక రకంగా ఆమె అభిమానులకు గుడ్ న్యూసే. కానీ, ఇందులో ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఆ వెబ్ సీరిస్ ఇండియాలో ఇప్పట్లో విడుదల కాదు.
‘ది హెడ్’ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చాలామంది సీజన్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఒలివియా తాజాగా ఈ వెబ్ సీరిస్ రిలీజ్ డేట్ ప్రకటించింది. జార్జ్ డొరాడో దర్శకతంలో తెరకెక్కిన ఈ సిరీస్, డిసెంబర్ 22న ఈ అమెరికాతో పాటు స్పెయిన్ లో ఒకేసారి విడుదల కానున్నట్లు పేర్కొంది. ‘ది హెడ్’ తొలి సీజన్ స్పెయిన్ లో అతిపెద్ద బ్రేక్ అవుట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. దీనిని మీడియా ప్రో స్టూడియో డిస్ట్రిబ్యూషన్ 90కి పైగా దేశాలకు విక్రయించింది, అమెరికాకు చెందిన టాప్ ఎచెలాన్ ప్లేయర్‌లు HBO Max, ప్లస్ Starzplay (U.K., జర్మనీ), కెనాల్ ప్లస్ ( ఫ్రాన్స్), అమెజాన్ ప్రైమ్ వీడియో (ఇటలీ, నెదర్లాండ్స్) ‘ది హెడ్’ సీజన్ 1 ను స్ట్రీమింగ్ చేశాయి. ‘ది హెడ్’ వెబ్ సీరిస్ ఇండియాలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-2 కూడా ఇందులోనే విడుదల కానుంది.
విడుదలకు సిద్ధమవుతున్న ‘ది హెడ్’ టీజర్ ఇటీవలే రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఈ సిరీస్ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. "ఈ ట్రైలర్ చూస్తుంటే, నా గడ్డంపై మంచు స్ఫటికాలు ఏర్పడుతున్నట్లు అనుభూతి చెందాను. వాస్తవానికి నాకు గడ్డమే లేదు” అని సుజీ ఫే ఫైనాన్షియల్ టైమ్స్ లో పేర్కొన్నారు.
En medio del océano, no hay donde esconderse.
— HBO Max España (@HBOMaxES) December 1, 2022
La segunda temporada de #TheHead se estrena el 22 de diciembre en https://t.co/8etSAQf0PL ⛴️ pic.twitter.com/mrmT1DKwop
సీజన్ 2 టీజర్-ట్రైలర్ ఆద్యంతం చాలా థ్రిల్లింగ్ ను కలిగిస్తోంది. విప్లాష్ ఎడిట్ చేసిన యాక్షన్ కోల్లెజ్‌లో గ్లింప్డ్ ఐరిష్ నటుడు మో డన్‌ఫోర్డ్, షిప్ సెక్యూరిటీ హెడ్, హోవిక్ కెచ్కేరియన్, స్పానిష్ నటుడు ఎన్రిక్ ఆర్స్, యువ జపనీస్ నటుడు సోటా ఫుకుషి, నటుడు నోరా రియోస్ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సిరీస్ లో ఒలివియా ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ నటీమణి, మోడల్ గా రాణించి '7 ట్రైల్స్ ఇన్ 7డేస్' అనే సిరీస్‌లో నటించింది.
Read Also: పూనమ్ కౌర్ ఆరోగ్యంపై అప్‌డేట్, రెండేళ్లుగా ఆ వ్యాధితో పోరాటం!
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?
Pathaan movie: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?
Janaki Kalaganaledu January 30th: తోపుడు బండి మీద వ్యాపారం మొదలుపెట్టిన రామా- అవమానించిన కన్నబాబు, బుద్ధి చెప్పిన జానకి
Adhire Abhi Comments: మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి, ‘జబర్దస్త్’పై అదిరే అభి కామెంట్స్!
Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్‌కు విజయశాంతి కౌంటర్
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే