Jagan Has No Humanity : జగనూ, నీకు మానవత్వం లేదు!
Prudhvi dialogue In ATM Web Series : 'ఒరేయ్ జగనూ, నీకు మానవత్వం లేదురా!' అని నటుడు పృథ్వీ అన్నారు. ఇప్పుడు ఆ డైలాగ్ ప్రేక్షకుల్లో డిస్కషన్‌కు కారణమైంది.

రాజకీయాలకు, నటుడు పృథ్వీ (30 Years Actor Prudhvi Raj)కు దగ్గర సంబంధం ఉంది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని రోజులు ఆయన ఉన్నారు. టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ పదవిలో కొనసాగారు. పదవి నుంచి ఆయన ఎలా వైదొలగినదీ అందరికీ తెలిసిందే. తన ఎదుగుదలను చూడలేక సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని... తనను ట్రాప్ చేసి, ఆడియోలను సృష్టించి ప్లాన్ ప్రకారం ఇరికించారని, తన తప్పు లేకపోయినా ఎస్వీబీసీ ఛానల్ పదవి నుంచి తప్పుకొనేలా చేశారని అప్పట్లో చెప్పారు.
వైసీపీలో ఉన్నప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై '30 ఇయర్స్' పృథ్వీ ఓ స్థాయిలో ప్రశంసల వర్షం కురిపించారు. నేతలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిని ప్రసన్నం పొగడటం కామన్. అలాగే, ఇతర పార్టీల్లో నాయకులపై తీవ్రమైన పదజాలంతో విరుచుకు పడటం అందులో భాగమే. వైసీపీలో ఉన్నప్పుడు పృథ్వీ కూడా అదే విధంగా చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విమర్శలు చేయడమూ అంతే కామన్. వైసీపీని వీడిన తర్వాత పృథ్వీ గతంలో విమర్శలు చేసిన వాళ్ళకు క్షమాపణలు చెప్పారు. జగన్ మీద విమర్శలు చేశారు. అదంతా గతం! ఇప్పుడు వర్తమానానికి వస్తే... 'ఏటీఎం'లో ఆయన డైలాగ్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.
జగన్‌కు మానవత్వం లేదా?
'జీ 5' ఓటీటీలో ఈ రోజు 'ఏటీఎం' వెబ్ సిరీస్ విడుదలైంది. అందులో రాజకీయ నాయకుడిగా పృథ్వీ నటించారు. ఎమ్మెల్యే కావాలని ఆశపడే కార్పొరేటర్ రోల్. పేరు గజేంద్ర. హీరోగా 'బిగ్ బాస్ 5'కి వెళ్లి వచ్చిన వీజే సన్నీ నటించారు. ఆయన క్యారెక్టర్ పేరు జగన్.
Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?
ఓ సమయంలో గజేంద్రను జగన్ మోసం చేస్తాడు. చాలా అంటే చాలా తెలివిగా ఓ కేసును ఇరికిస్తాడు. బయటకు రాలేని విధంగా కార్నర్ చేస్తాడు. చేయని తప్పు చేశాడనే అభియోగం మోపడంతో పాటు కోర్టులో దోషిని నిలబెడతాడు. అప్పుడు గజేంద్ర నోటి నుంచి వచ్చే డైలాగ్ ''ఒరేయ్ జగనూ... నీకు మానవత్వం లేదురా'' అని! పృథ్వీ ఈ డైలాగ్ చెప్పడంతో ఏపీలో రాజకీయాలు గమనించే వ్యక్తులకు ఏవేవో గుర్తుకు వస్తున్నారు. ఎవరెవరికో ఆ మాటకు ఆపాదిస్తున్నారు. ఈ డైలాగ్ ఎవరి మీద అనే డిస్కషన్ మెల్లగా మొదలైంది. జగన్ మీద పృథ్వీ విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనకు వెబ్ సిరీస్‌లో కూడా కౌంటర్ వేశారా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదీ సంగతి!
Also Read : 'ఏటీఎం' వెబ్ సిరీస్ రివ్యూ : వీజే సన్నీ దొంగతనం సక్సెసా? ఫెయిలా? 'దిల్' రాజు ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?
వైసీపీలోని మంత్రులు, ఇతర నాయకులపై జనసేన పార్టీ సానుభూతిపరులు కొందరు విమర్శల వేడి పెంచిన నేపథ్యంలో '30 ఇయర్స్' పృథ్వీ డైలాగ్ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునేలా కనబడుతోంది. సోషల్ మీడియాలో క్లిప్పింగులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఏపీ ప్రభుత్వంపై 'వీర సింహా రెడ్డి' సెటైర్స్!
సంక్రాంతికి విడుదలైన 'వీర సింహా రెడ్డి'లోనూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. 'ప్రజలు ఎన్నుకున్న వెధవలు' డైలాగ్ వైరల్ అయ్యింది. అదే విధంగా 'సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో! కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు' - 'వీర సింహా రెడ్డి' ట్రైలర్‌లో డైలాగ్ రాజకీయ పరంగా చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై పేల్చిన డైలాగ్ బుల్లెట్ కింద ఆ మాటను చాలా మంది చూశారు. అభివృద్ధి ఎక్కడ? అంటూ బాలకృష్ణ వేసిన సెటైర్స్, జీవో డైలాగులకు ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా వచ్చింది. ఏపీ మంత్రులు ఆ సెటైర్లకు కౌంటర్ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

