అన్వేషించండి

EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి

EVM checking in India | భారత ఎన్నికల చరిత్రలో తొలిసారి ఎన్నికల అనంతరం అభ్యర్థులు, అధికారుల సమక్షంలో EVMలను తనిఖీ చేయనున్నారు. ఈ మేరకు బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ముంబై: దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) తనిఖీ, పరిశీలించేందుకు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ ఈవీఎంల పరిశీలనకు ఆదేశాలను జారీ చేశారు. ఈ కేసులో పిటిషనర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి నసీమ్ ఖాన్.  ప్రతివాదిగా శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే ఉన్నారు.

అసలేం జరిగిందంటే.. 
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై శివారు జిల్లాలోని చాందీవలి నుంచి దిలీప్ లాండే (ఏకనాథ్ షిండే వర్గం శివసేన) మాజీ మంత్రి నసీమ్ ఖాన్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల చోరీపై  ఆరోపణలు చేశారు. బాంబే హైకోర్టులో జరిగిన విచారణలో భారత ఎన్నికల కమిషన్ తరపున లాయర్లు నైరా జేజీభాయ్, అరుణ్ పనిక్కర్, తన్మయ్ పవార్, వినయ్ నాయర్, ఆయుష్ యాదవ్ హాజరయ్యారు.

చారిత్రాత్మక ఆదేశం, అవసరమైన న్యాయపరమైన జోక్యం
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసిన పిటిషనర్ తరపున ఓటింగ్ మేషిన్ల తనిఖీకి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. భారత ఎన్నికల కమిషన్ 2 నెలల లోపు యంత్రాల పరిశీలనను పూర్తి చేయాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. భారత ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు ఎన్నికల తర్వాత అభ్యర్థులు, అధికారుల సమక్షంలో ఈవీఎంల తనిఖీ జరగలేదని.. ఇదే తొలిసారి అని నసీమ్ ఖాన్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును ఆయన చారిత్రాత్మక ఆదేశం, ప్రజాస్వామ్యంలో అవసరమైన న్యాయపరమైన జోక్యంగా అభివర్ణించారు.

ఏప్రిల్ 16, 17 తేదీల్లో ముంబైలో చెకింగ్ 
ఏప్రిల్ 16, 17 తేదీల్లో ముంబైలో ఈవీఎం తయారీ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెంగళూరు) ద్వారా కేవలం డయాగ్నోస్టిక్ చెకింగ్ మాత్రమే నిర్వహించనున్నారని ముంబై సబర్బన్ జిల్లా డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ అర్చన కదం తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను తమ తమ నియోజకవర్గాల్లో ఈవీఎం, వీవీప్యాట్ (VVPAT - ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్) యూనిట్ల పరిశీలించేందుకు డిమాండ్ చేయాలని కోరింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా (I.N.D.I.A) కూటమికి చెందిన సుమారు రెండు డజన్ల మంది అభ్యర్థులు ఈవీఎంల విశ్వసనీయతపై ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ఏప్రిల్ 2024 నాటి తీర్పును ఉటంకిస్తూ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 శాతం ఈవీఎంల (కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్) "బర్న్ట్ మెమరీ/ మైక్రోకంట్రోలర్"ను ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈవీఎం తయారీ కంపెనీల ఇంజనీర్ల టీమ్ చెక్ చేయాలని నసీమ్ ఖాన్ అన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget