అన్వేషించండి

CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్

CBSE Class 12 Result 2026: CBSE బోర్డు బుధవారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు results.cbse.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) 12వ తరగతి ఫలితాలను బుదవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను, మార్క్‌షీట్‌లను CBSE అధికారిక వెబ్‌సైట్లు cbse.gov.in , results.cbse.nic.in లో అందుబాటులో ఉన్న డైరెక్ట్ లింక్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. https://cbseresults.nic.in/

ఆన్‌లైన్‌తో పాటు ఇంటర్ విద్యార్థులు ఇంటర్నెట్ లేకుండా కూడా తమ ఫలితాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20 శాతంగా నమోదైంది. గత ఏడాది ఈ గణాంకం 88.39 శాతంగా ఉంది. ఈ ఏడాది సుమారు 3.19 శాతం తగ్గుదల నమోదైంది. పేపర్ స్థాయి, కఠినమైన వాల్యుయేషన్, కొత్త డిజిటల్ ప్రక్రియ ఈ మార్పునకు కారణం కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు?
ఈ ఏడాది 17 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 16.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఉండటం అనేది దేశంలోని అతిపెద్ద విద్యా కార్యక్రమాలలో ఈ బోర్డు పరీక్ష ఒకటని తెలియజేస్తోంది. 

బాలికలదే పైచేయి 
ప్రతి ఏటా లాగే ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 శాతం కాగా, బాలురది 82.13 శాతం. అంటే అమ్మాయిలు సుమారు 6.73 శాతం ముందున్నారు. ఈ వ్యత్యాసం కేవలం అంకెలు మాత్రమే కాదు, చదువులో అమ్మాయిల ఫలితాలు పెరగడం మార్పును సూచిస్తుంది. 

టాప్ రీజియన్లు ఏవి?
తిరువనంతపురం (కేరళ): అత్యధికంగా సుమారు 99 శాతం ఉత్తీర్ణతతో అద్భుతం చేసింది. 

విజయవాడ, చెన్నై: ఇవి కూడా టాప్ రీజియన్లలో చోటు దక్కించుకున్నాయి. 

ప్రయాగ్‌రాజ్, పాట్నా వంటి ప్రాంతాల ప్రదర్శన చాలా తక్కువగా ఉంది. అక్కడ మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. 

ఢిల్లీలో ప్రదర్శన
దేశ రాజధాని ఢిల్లీ ఫలితాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి.

ఢిల్లీ వెస్ట్: సుమారు 92.3 శాతం

ఢిల్లీ ఈస్ట్: సుమారు 91.73 శాతం

ఓవరాల్ ఢిల్లీ: సుమారు 91.9 శాతం

డిజిటల్ వ్యవస్థతో వచ్చిన మార్పు
ఈ ఏడాది ఫలితాల ప్రక్రియలో అతిపెద్ద ప్రత్యేకత పేపర్ల మూల్యాంకనంలో కొత్త విధానం అమలు చేస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు On-Screen Marking (OSM) వ్యవస్థను అమలు చేసింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. 

పేపర్లు ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేశారు. 

మానవ తప్పిదాల అవకాశం పూర్తిగా తగ్గింది.

రిజల్ట్స్ కోసం టైం ఆదా అయ్యింది.

మొత్తం ప్రక్రియ మరింత పారదర్శకంగా మారింది.

UMANG యాప్ ద్వారా ఫలితాలు
UMANG యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి

సెర్చ్ బాక్స్‌లో CBSE Service అని సెర్చ్ చేయండి.

“Class 12 Result” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీ వివరాలను ఫిల్ చేయగానే ప్రొవిజనల్ మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

విద్యార్థులు దీనిని డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.

DigiLocker ద్వారా ఫలితాల చెక్ చేయండి
- విద్యార్థులు DigiLocker యాప్ లేదా digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.

- నమోదిత మొబైల్ నంబర్ లేదా ఇతర ఐడెంటిటీ వివరాలతో లాగిన్ అవ్వండి.

- తరువాత Education సెక్షన్‌లోకి వెళ్లి CBSEని ఎంచుకోండి.

- అక్కడ “Class 12 Marksheet” పై క్లిక్ చేయండి.

- రోల్ నంబర్, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయగానే మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ షీట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసిపెట్టుకోవడం మంచిది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Commercial Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget