WhatsApp status Murder : "వాట్సాప్ స్టేటస్" ఓ మర్డర్‌కు కారణం అయింది - ఎందుకో తెలిస్తే అలాంటి పనులు చేయరు !
మహారాష్ట్రలో ఓ హత్యకు వాట్సాప్ స్టేటస్ కారణం అయింది. తన గురించే వాట్సాప్ స్టేటస్ పెట్టారని గొడవకు దిగి మహిళను కొట్టి చంపేశారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ( Palghar ) 48 ఏళ్ల ఓ మహిళను పక్కింటి మహిళ, ఆమె కూతురు కలిసి చితక్కొట్టారు. ఆ దెబ్బల ధాటికి ఆ మహిళ చనిపోయింది. ఎందుకు కొట్టారని చుట్టుపక్కల వారు ప్రశ్నిస్తే ఆ తల్లీ కూతుళ్లు చెప్పిన సమాధానం వాట్సాప్ స్టేటస్ ( WhatsApp status ). చనిపోయిన మహిళ కూతురు తమ గురించే వాట్సాప్ స్టేటస్ పెట్టిందని తమ పరువు తీస్తోందనే కొట్టి చంపామని ( Murder ) తెలిపారు. ఆ వాట్సాప్ స్టేటస్‌లో ఏముందని చూస్తే ... మనిషి వ్యక్తిత్వం గురించి ఓ కొటేషన్ ఉంది. అది అందరూ పెట్టుకునే ఓ స్టేటస్ అని.. మీ మీద కాదని వారికి చెప్పినా ... అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పాల్ఘర్ జిల్లాలో ప్రీతీ ప్రసాద్ అనే ఇరవై ఏళ్ల యువతి కుటుంబంతో నివసిస్తోంది. వారింటికి సమీపంలో ఉండే పదిహడేళ్ల అమ్మాయితో ప్రీతీ ప్రసాద్ కు స్నేహం కుదిరింది. ఇద్దరూ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేవారు. ఇలా వారి మధ్య స్నేహం బాగానే ఉంది. ప్రీతీ ప్రసాద్‌కు కొటేషన్లను వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకోవడం అలవాటు. అలా ఆమె పెట్టుకున్న ఓ వాట్సాప్ స్టేటస్‌ను పదిహడేళ్ల యువతి చూసింది. అది తాను తాను చెప్పిన వ్యక్తిగత విషయాన్ని గుర్తుకు తెచ్చేలా ఉందని భావించింది. తమ గురించి అందరికీ చెబుతోందన్న ఉద్దేశంతో తల్లితో కలిసి ప్రతీ ప్రసాద్ ఇంటిపై గొడవకు వెళ్లింది.
అక్కడ రెండు కుటుంబాలు గొడవకు దిగాయి. ఈ గొడవలో పదిహేడేళ్ల అమ్మాయి, ఆమె తల్లి కలిసి ప్రీతి ప్రసాద్ తల్లిని తట్టుకోలేని విధంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు., నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం వాట్సాప్ స్టేటస్సేనా లేకపోతే పాత తగాదాలు ఏమైనా ఉంటే .. ఆ కోణంలో పగ తీర్చుకుని కారణం వాట్సాప్ స్టేటస్ అని చెబుతున్నారా అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు.
ఇద్దరి స్నేహితుల ( Friends ) మధ్య అపోహలు ప్రారంభమైతే... అది తీవ్రమైన శత్రుత్వానికి దారి తీస్తుంది. పాత స్నేహితుడు ఏం చెప్పినా అది తన గురించే అనుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఓ మహిళ ప్రాణం పోవడానికి.,., మరో కుటుంబం జైలు పాలవడానికి కారణం అయింది. అందుకే ఇక వాట్సాప్ స్టేటస్‌లు పెట్టేటప్పుడు కూడా కాస్త ఆలోచించడం మంచిదేమో ?