Woman Skeleton: మూడేళ్ల క్రితం మిస్ అయిన మహిళ, సెప్టిక్ ట్యాంక్‌లో అస్తిపంజరం
Woman Skeleton: మూడేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ అస్తిపంజరాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో గుర్తించారు.
Woman Skeleton:
మూడేళ్ల క్రితం అదృశ్యం..
వెస్ట్ బెంగాల్‌లో ఓ మహిళ అదృశ్యమైన మూడేళ్ల తరవాత ఓ సెప్టిక్ ట్యాంక్‌లో ఆమె అస్తిపంజరం దొరకడం సంచలనమైంది. సీఐడీ అధికారులు సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి ఆ అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్తని విచారించిన పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. మర్డర్ కేస్ పెట్టారు. మృతురాలిని తుంపా మండల్‌గా గుర్తించారు. 2020 మార్చినెలలో ఆమె అదృశ్యమైంది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు పెట్టాడు. అదే ఏడాది ఏప్రిల్‌లో పోలీసులు బాధితురాలి భర్తని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ జరిపి అరెస్ట్ చేశారు. అయితే...పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడం వల్ల నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తరవాత బాధితురాలి తండ్రి కలకత్తా హైకోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరపాలని కోరాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు...వెస్ట్‌బెంగాల్ సీఐడీకి బదిలీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కేసుని టేకప్ చేసింది. అప్పటి నుంచి CID అధికారులు దీనిపై విచారణ మొదలు పెట్టారు.
భర్తే నిందితుడు..
బాధితురాలి భర్తను పదేపదే ప్రశ్నించారు. కొన్నాళ్లకు తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. అంతే కాదు. మర్డర్ చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్టు చెప్పాడు. వెంటనే అతడిపై మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు. బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో ఈ ఇద్దరూ నివసించే వాళ్లు. 2020లోనే తన భార్యను చంపేసినట్టు ఒప్పుకున్నాడు. తరవాత ఎవరికీ అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. నిందితుడు చెప్పిన ఆధారాల మేరకు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టిన పోలీసులకు మృతురాలి అస్తిపంజరం దొరికింది. ఆమె జ్యువెల్లరీని అదే స్పాట్‌లో స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో దిండు ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు.
యూపీలో దారుణం..
యూపీలో దారుణ హత్య జరిగింది. ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను కిరాతకంగా చంపేసింది. ఆ తరవాత ఆ డెడ్‌బాడీని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసింది. మండల్ గ్రామంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఆ మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. జూన్ 6వ తేదీ నుంచి సాగర్ (మృతుడు) కనిపించకుండా పోయాడు. మిస్ అయ్యాడుకున్న వ్యక్తి సెప్టిక్ ట్యాంక్‌లో శవంలా కనిపించాడు. వెంటనే భార్యను విచారించడం మొదలు పెట్టారు పోలీసులు. నిందితురులా అశియా నేరాన్ని అంగీకరించింది. లవర్‌తో కలిసి భర్తను హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్టు వివరించింది. వివాహేతర సంబంధం గురించి తన భర్తకు తెలిసిపోయిందని, అందుకే ఇద్దరం కలిసి చంపేశామని చెప్పింది. ఈ స్టేట్‌మెంట్‌ని రిజిస్టర్ చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జూన్ 6వ తేదీన హత్య చేసి...నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో బాడీని పడేశారు. ఈ హత్య చేసిన తరవాత కూడా అదే ఇంట్లో ఉంది ఆ మహిళ. జూన్ 9వ తేదీన పోలీసులు ఆ శవాన్ని గుర్తించి బయటకు తీశారు. సాగర్ మిస్ అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా...ఇదంతా బయట పడింది.
Also Read: కిడ్నాప్ చేస్తున్నాడన్న డౌట్‌తో ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు, పరిస్థితి విషమం