కిడ్నాప్ చేస్తున్నాడన్న డౌట్‌తో ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు, పరిస్థితి విషమం
Uber Driver: టెక్సాస్‌లో ఓ మహిళ తనను కిడ్నాప్ చేస్తున్నారన్న డౌట్‌తో ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు జరిపింది.
Uber Driver:
టెక్సాస్‌లో ఘటన..
అమెరికాలోని ఓ మహిళ ఉబర్ డ్రైవర్‌ని కాల్చింది. తనను కిడ్నాప్ చేస్తున్నాడన్న అనుమానంతో గన్‌తో కాల్చేసింది. జూన్ 16వ తేదీన టెక్సాస్‌లో ఈ ఘటన జరిగింది. నిందితురాలు 48 ఏళ్ల ఫోయెబీ కోపస్‌గా గుర్తించారు. డ్రైవర్ డ్యానియల్‌ని గన్‌తో కాల్చి చంపినట్టు అంగీకరించింది. అప్పటికే ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉంది ఫోయెబీ. ఆమెపై పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. అప్పటికే పోలీసులు వెతుకుతున్నారు. కార్ రైడ్ బుక్ చేసుకున్న ఆమెకి డ్రైవర్‌పై డౌట్ వచ్చింది. తనను కిడ్నాప్ చేసి పోలీసులకు అప్పగిస్తాడేమో అని అనుమానపడింది. వెంటనే తన బ్యాగ్‌లో నుంచి గన్ తీసి కాల్చి అక్కడి నుంచి పారిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు రైడ్ బుక్ చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కార్‌లో వెళ్తుండగా మెక్సికో హైవే బోర్డ్ చూసింది. డ్రైవర్ తనను కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడని అనుకుంది. ఆ తరవాత దాడి చేసింది. 52 ఏళ్ల డ్రైవర్ తల, మణికట్టుకి గురి పెట్టి కాల్చింది. ఫలితంగా కార్ అదుపు తప్పి క్రాష్ అయింది. పోలీసులకు ఫోన్ చేసే ముందు ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించిన ఫోటో తీసుకుని బాయ్‌ఫ్రెండ్‌కి పంపింది నిందితురాలు. పోలీసులు మాత్రం ఆమెని డ్రైవర్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించానడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెబుతున్నారు. ఉబర్ యాప్‌లో ఉన్న మ్యాప్‌ని బట్టి లొకేషన్‌కి వెళ్తున్నాడని, ఆ మహిళే తప్పుగా అర్థం చేసుకుని కాల్చిందని వెల్లడించారు. ఈ ఘటనపై ఉబర్ స్పందించింది. ఇది విని షాక్‌కి గురైనట్టు చెప్పింది. ప్రస్తుతానికి బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
"ఉబర్ డ్రైవర్‌లపై ఇలా దాడులు చేయడాన్ని అసలు సహించం. ఇలాంటి హింసాత్మక ఘటనలను నిర్లక్ష్యం చేయం. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆ రైడర్‌ని మా నెట్‌వర్క్ నుంచి బ్యాన్ చేశాం"
- ఉబర్ యాజమాన్యం