West Bengal News : జైలులో ఫ్రీ ఫుడ్, వసతి ఉంటుందని అన్నయ్యనే హత్య చేశాడు, కానీ చివర్లో ట్విస్ట్!
West Bengal News : ఓ వ్యక్తి తన సోదరుడి హత్య చేసినట్లు పోలీసులు వద్దకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేశాడు. అయితే అసలు విషయం పోస్ట్ మార్టంలో బయటపడింది. విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.
West Bengal News : పశ్చిమ బెంగాల్‌లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన సోదరుడిని హత్య చేసినట్లు పోలీసులను ఆశ్రయించాడు. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోణిలోని నిరంజన్ పల్లి ప్రాంతంలో ఓ వ్యక్తి సెరిబ్రల్ స్ట్రోక్ తో చనిపోయాడు. అయితే ఆ వ్యక్తి సోదరుడు ఓ మర్డర్ స్టోరీ అల్లాడు. నిరుద్యోగిగా ఉన్న అతడు జైలులో భోజనం, ఉండటానికి ప్లేస్ ఉంటుందని హత్య కథను రూపొందించాడని పోలీసులు గుర్తించారు. శుభాశిష్ చక్రవర్తి అనే వ్యక్తి ‘నా అన్నయ్యను నేనే చంపేశాను, నన్ను పట్టుకోండి’ అని పోలీసులను పదేపదే విసిగించాడు. అతను తన సోదరుడిని దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశానని, మృతదేహం ఉన్న ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లాడు.
పింఛనే ఆధారం
పోలీసులు మృతుడు దేబాశిష్ చక్రవర్తి (48)గా గుర్తించారు. జాదవ్‌పూర్‌లోని సిరామిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగి అయిన తల్లితో దేబాశిస్, శుభాశిష్ లు నివసించేవారు. పదవీ విరమణ తర్వాత వారి తల్లికి రూ.35,000 పింఛను వచ్చేది. దేబాశిస్ కూడా అదే కంపెనీలో పనిచేశాడు. అయితే పనిచేస్తున్నప్పుడు అతని కళ్లు దెబ్బతినడంతో పనిమానేశాడు. అతడు నెలకు రూ.15 వేలు పింఛను పొందేవాడు. అయితే అతని సోదరుడు 2017 ఖాళీగా ఉన్నాడు. బాండ్‌స్రోనిలోని సోనాలి పార్క్‌లోని ఓ ఫ్లాట్‌లో ఈ కుటుంబం అద్దెకు ఉండేది. గత మే నెలలో వారి తల్లి చనిపోవడంతో సోదరులు నిరంజన్ పల్లిలోని ఒక చిన్న ఇంటికి వెళ్లి దేబాశిస్ పింఛన్ తో జీవించేవారు.
హత్య కథ
కొన్ని రోజుల క్రితం దేబాశిస్ తన తమ్ముడికి ఎక్కువ కాలం జీవించలేనని, తన పింఛను నిలిపివేస్తారని చెప్పాడు. అతని మరణం తర్వాత తన సోదరుడు ఆకలితో చనిపోతాడని భయపడ్డాడు. తన మరణం తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి హత్య కథను చెప్పమని దేబాశిస్ శుభాశిష్ ని కోరినట్లు సమాచారం. హత్య కేసులో జీవిత ఖైదు పడితే ప్రభుత్వ ఖర్చుతో జీవితాంతం జైల్లోనే ఉండొచ్చని తన సోదరుడికి చెప్పినట్లు సమాచారం. అయితే పోస్టుమార్టం తర్వాత హత్య చేయలేదని సెరిబ్రల్ స్ట్రోక్‌తో అతడు మరణించాడని పోలీసులకు తెలిసింది.
Also Read : Eluru Murder Arrest: తమ్ముడ్ని చంపేసిన అన్న వదినలు - పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి