Vijayawada: ఇక చెడ్డీ గ్యాంగ్ ల ఆటకట్టు... రంగంలోకి ప్రత్యేక నిఘా బృందాలు... విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా
చెడ్డీ గ్యాంగ్ ల ఆట కట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా తెలిపారు. త్వరలో ఈ ముఠాలను పట్టుకుంటామని స్పష్టం చేశారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ చేస్తోన్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ లేదా పార్థి గ్యాంగ్‌ల పనేనని నిర్ధారణకు వచ్చామని చెప్పారు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలకు చెందిన ముఠాగా భావిస్తున్నామని సీపీ చెప్పారు.
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
రైల్వే స్టేషన్లలో తనిఖీలు
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెల 29వ తేదీ నుంచి చెడ్డీ గ్యాంగ్ చేస్తున్న చోరీలపై నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా దృష్టి సారించారు. ఆయన పోలీస్ అధికారులతో కలిసి రైల్వే స్టేషన్ ను పరిశీలించారు. గుణదల రైల్వే స్టేషన్, మధుర నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. గుణదల రైల్వే స్టేషన్ వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను పోలీసులు ప్రశ్నించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్ బ్యాచ్ రైల్వే స్టేషన్ లను స్థావరాలుగా చేసుకునే అవకాశం ఉందని ఆ దిశలోనే తనిఖీలు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ ముఠాను త్వరలోనే పట్టుకుంటామని, వారి కదలికలపై ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Also Read:చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ ఎఫైర్.. భర్త వెళ్లగానే ఇంట్లోకి వచ్చేవాడు.. విషయం బయటకు తెలిసి.
చెలరేగిపోతున్న చెడ్డీ గ్యాంగ్
బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ చెలరేగిపోతున్నారు. నగర శివారులో వరుస దోపిడీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. చెడ్డీలు ధరించి, మారణాయుధాలతో దొంగతనాలకు తెగబడుతున్నారు. ఇటీవల సీఎం క్యాంపు ఆఫీసుకు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అపార్ట్ మెంట్ లలో చోరీ చేశారు. దొంగతనం సమయంలో ఎవరైనా ప్రతిఘటిస్తే వారిని హతమార్చడం, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడడం చేస్తున్నారు చెడ్డీ గ్యాంగ్. వినడానికి వణుకు పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్ ఇటీవల హైదరాబాద్‌లో దడ పుట్టించారు. ఇప్పుడు ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హడలెత్తిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో చెడ్డీ గ్యాంగ్ వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. పది రోజుల వ్యవధిలో చెడ్డీ గ్యాంగ్ ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. చిట్టి నగర్, గుంటుపల్లి, తాడేపల్లి, కుంచనపల్లి అపార్ట్ మెంట్లలలో దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో