News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Football Player Murder: విజయవాడలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణహత్య, శరీరంపై 16 కత్తిపోట్లు - గ్యాంగ్ వార్‌తో విషాదం !

Vijayawada Football Player Murder: రౌడీ షీటర్ అంత్యక్రియల్లో తలెత్తిన వివాదమే ఫుట్‌బాల్ ప్లేయర్, గురునానక్ కాలనీ జక్కంపూడికి చెందిన ఆకాష్‌ దారుణహత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. 

FOLLOW US: 
Share:

విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్‌లో ఫుట్‌బాల్ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. బార్‌లో జరిగిన వివాదంతో గురునానక్ కాలనీ జక్కంపూడికి చెందిన ఆకాష్‌ను కొందరు దుండగులు హత్యచేశారు. ఇటీవల జరిగిన రౌడీ షీటర్ అంత్యక్రియల్లో తలెత్తిన వివాదమే ఫుట్‌బాల్ ప్లేయర్ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో రౌడీషీటర్ శంకర్ అలియాస్ టోనీ మరణించాడు. అతడి డెడ్ బాడీకి జీజీహెచ్‌లో పోస్టుమార్టం జరిపించారు టోనీ అనుచరులు. ఆ తరువాత దగ్గర్లోని ఓ బార్‌లో మద్యం సేవించేందుకు వెళ్లారు. శంకర్ గ్రూపులోనే రెండు వర్గాలు ఉన్నాయి. వీరంతా కలిసి మద్యం సేవిస్తుండగా ఓ వర్గానికి చెందిన యువకుడు, జక్కంపూడి కాలనీకి చెందిన ఆకాష్(23)కి, మరో వర్గానికి చెందిన వారితో గొడవ జరిగింది. ఈ గొడవలో అవతలి వర్గంలోని ఒకరిపై ఆకాష్ దాడి చేశాడు. ఇది సహించలేని ప్రత్యర్థి వర్గం ఆకాష్‌ను గురునానక్ కాలనీలోని ఓ స్నేహితుడికి రూమ్‌కు బలవంతంగా లాక్కెళ్లారు.

గదిలో ఉన్న ఆకాష్ మద్యం మత్తులో నిద్రపోగానే, ప్రత్యర్ధి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఫుల్లుగా మద్యం, గంజాయి సేవించి గురునానక్ కాలనీకి వచ్చారు.  ఒక్కసారిగా గుంపు అక్కడికి రావడంతో అకాష్ వెంట ఉన్న వారు గది నుంచి పారిపోయారు. మరో వ్యక్తిని బెదిరించి బయటకు పంపించేశారు. ఇదే ఛాన్స్ అని భావించిన దుండగులు ఒక్కసారిగా కత్తులతో ఆకాష్‌పై విచక్షణా రహితంగా దాడిచేయగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ప్రత్యర్ధి వర్గం వెళ్లిపోయిందని తెలుసుకున్న వెంటనే అక్కడి చేరుకున్న స్నేహితులు ఆకాష్ పరిస్థితిని చూసి షాకయ్యారు. అతడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆకాష్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

శరీరంపై 16 కత్తిపోట్లు..
రౌడీ షీటర్ టోనీ అంత్యక్రియల్లో వివాదమే ఆకాష్ హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన వ్యక్తులు ఆకాష్‌ను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గొంతు, మెడ, పొట్ట భాగంలో మొత్తం 16 వరకు కత్తిపోట్లు ఉన్నాయని తెలిపారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి విచారణ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ ప్లేయర్ అయిన ఆకాష్ పలు టోర్నీలలో పాల్గొని కప్‌లు గెలుచుకున్నాడు. కానీ రౌడీ గ్యాంగ్‌తో కలిసి తిరగడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆకాష్‌కు తల్లిదండ్రులు, ఓ సోదరి ఉన్నారు.

 Also Read: Ayyanna Patrudu In Tirumala: ఏపీని ఆ దుర్మార్గుడి నుంచి శ్రీవారే రక్షించాలి - మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు

Published at : 01 Jun 2022 12:51 PM (IST) Tags: vijayawada Crime News Gang War Aakash Murder Football Player Murder Case

ఇవి కూడా చూడండి

Vikarabad Serial killer arrest: మహిళల హత్యల కేసులో సైకో కిల్లర్ అరెస్ట్, సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు

Vikarabad Serial killer arrest: మహిళల హత్యల కేసులో సైకో కిల్లర్ అరెస్ట్, సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు

Cyber Fraud: అనంతపురం పోలీసుల సాహసం- వెలుగులోకి 300 కోట్ల రూపాయల సైబర్‌ ఫ్రాడ్‌

Cyber Fraud: అనంతపురం పోలీసుల సాహసం- వెలుగులోకి 300 కోట్ల రూపాయల సైబర్‌ ఫ్రాడ్‌

Kerala Doctor Suicide: BMW కార్‌ కట్నంగా ఇవ్వనందుకు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాయ్‌ఫ్రెండ్‌, 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య

Kerala Doctor Suicide: BMW కార్‌ కట్నంగా ఇవ్వనందుకు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాయ్‌ఫ్రెండ్‌, 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య

NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్

NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్

Anantapur Crime: అనంతలో ‘దృశ్యం’ సినిమా స్టైల్లో యువకుడి మర్డర్

Anantapur Crime: అనంతలో ‘దృశ్యం’ సినిమా స్టైల్లో యువకుడి మర్డర్

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే