Suryapet: సూర్యాపేటలో కిరాతక హత్య, బురదలో పడేసి.. ట్రాక్టర్ దమ్ము చక్రాలతో తొక్కించి..
ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో పాత కక్షలు ఉండడంతో ట్రాక్టర్‌ను పోనిచ్చి అతనిపై నుంచి దమ్ము చక్రాలతో తొక్కించాడు.
సూర్యాపేటలో అత్యంత అమానవీయ, దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అతి కిరాతకమైన రీతిలో హత్యకు గురయ్యాడు. పట్టపగలే ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం. భార్యతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడనే అనుమానంతో ఆ యువకుడిని మరో వ్యక్తి చంపాడు. ట్రాక్టర్ దమ్ము చక్రాలతో తొక్కించి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ పాశవిక ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో గ్రామంలో బుధవారం వెలుగుచూసింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇవీ.. లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేశ్ అనే 30 ఏళ్ల వ్యక్తి వ్యవసాయ రైతు. మంగళవారం తన సోదరుడు నాగరాజు పొలంలో నాట్లు వేస్తుండగా.. ఆ పనిలో మహేశ్ కూడా పాల్గొన్నాడు. సాయంత్రం నాట్ల పని ముగిసిన తర్వాత వచ్చిన కూలీలను వారి గ్రామంలో దింపడానికి నాగరాజు ట్రాక్టర్‌లో ఎక్కించుకొని వెళ్లాడు. తర్వాత మహేశ్ బైక్‌పై ఇంటి ముఖం పట్టాడు.
మరోవైపు, అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఒకరు మరొకరి పొలం పనిలో పాల్గొని దమ్ము చేసి అదే దారి గుండా ఇంటి వెళ్తున్నాడు. బైక్‌పై ఒంటరిగా వెళ్తున్న మహేశ్‌ను అతడు గమనించాడు. వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో పాత కక్షలు ఉండడంతో ట్రాక్టర్‌తో నిర్దాక్షిణ్యంగా మహేశ్ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో మహేశ్ బైక్‌తో సహ పక్కనే ఉన్న పొలంలో పడిపోయాడు. అది బురదతో కూడిన మడి. ఆ దమ్ము చేసిన మడిలోకి.. వెంటనే ట్రాక్టర్‌ను పోనిచ్చి అతనిపై నుంచి దమ్ము చక్రాలతో తొక్కించాడు. దీంతో మహేశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చివరికి ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను ఘటన స్థలానికి కొద్ది దూరంలో వదిలేసి పారిపోయాడు.
బుధవారం ఉదయం అటువైపు వచ్చిన రైతులు, కూలీలు గమనించి, దమ్ము చేసిన మడిలో మహేశ్ శవాన్ని గమనించి గ్రామస్థులకు తెలియజేశారు. వారు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరపగా.. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్టర్ డ్రైవర్ భార్యకు మహేశ్‌తో వివాహేతర సంబంధం ఉందని.. ఇదే విషయంపై నాలుగేళ్ల కిందట గ్రామంలో పెద్ద మనుషుల పంచాయితీ కూడా జరిగిందని తెలిసింది. ఆ తర్వాత సమస్య చల్లబడ్డా.. ఇటీవల మళ్లీ తన భార్య జోలికి మహేశ్ వస్తున్నాడనే అనుమానం పెంచుకుని ఇతను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read: Hyderabad: రెండో భర్త పోయినా బాధలేని భార్య.. ఒకేసారి మరో ఇద్దరితో అఫైర్, చివరికి..
Also Read: ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !