IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Hyderabad: రెండో భర్త పోయినా బాధలేని భార్య.. ఒకేసారి మరో ఇద్దరితో అఫైర్, చివరికి..

భర్త చనిపోయిన బాధ లేకుండా మరో ఇద్దరితో భార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భర్త స్నేహితుడిని ప్రియుడితో కలిసి హత్య చేసిందని వెల్లడించారు.

FOLLOW US: 

రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన ఘటనను వనస్థలిపురం పోలీసులు సవాలుగా స్వీకరించారు. విచారణ చేపట్టగా కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితులను గుర్తించి హత్యకు పాల్పడిన ఇద్ధరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చనిపోయిన వ్యక్తి జేబులో లభించిన ఓ ఏటీఎం కార్డు నిందితులను పట్టించిందని పోలీసులు తెలిపారు. మంగళవారం వనస్థలిపురం ఎస్సై సత్యనారాయణ ఈ వివరాలు తెలిపారు. 

భర్త చనిపోయిన బాధ లేకుండా మరో ఇద్దరు యువకులతో భార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భర్త స్నేహితుడిని ప్రియుడితో కలిసి హత్య చేసిందని వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా  బొమ్మకల్‌ గ్రామానికి చెందిన కె.ప్రియాంక, అలియాస్‌ దీప్తి అనే 27 ఏళ్ల వివాహితకు గతంలోనే పెళ్లి కాగా, భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఉదయ్‌ కుమార్‌ అనే వ్యక్తిని రెండోసారి పెళ్లి చేసుకుంది. అతను గతేడాది కరోనా సెకండ్ వేవ్‌లో చనిపోయాడు. ఆ తర్వాతి నుంచి ప్రియాంక మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. ఆ సమయంలో ఆమె రెండో భర్త స్నేహితుడు గుడిపాటి శ్రీనివాస్‌తో ప్రియాంకకు పరిచయం ఏర్పడింది. 

మిర్యాలగూడలో ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం కొనసాగిస్తూనే హైదరాబాద్‌ ఫిలింనగర్‌కు చెందిన అలిగె సాయికుమార్‌ అలియాస్‌ రాజు అలియాస్‌ బేబీతో షేర్‌చాట్‌లో పరిచయం ఏర్పడి.. అది కూడా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో ఆమె గతేడాది అక్టోబర్‌లో వనస్థలిపురానికి మకాం మార్చింది. గత డిసెంబర్‌ 10న శ్రీనివాస్‌ ప్రియాంక ఇంటికి రాగా, సాయికుమార్‌ కనిపించాడు. దీంతో ఇద్దరితో ఎలా సంబంధం కొనసాగిస్తున్నావని నిలదీశాడు. ఇరువురి మధ్య గొడవ పెరగడంతో సాయికుమార్‌ ఇంట్లో ఉన్న రోకలి బండతో శ్రీనివాస్‌ తలపై బలంగా కొట్టాడు. దీంతో చనిపోయాడు. ఈ విషయాన్ని ప్రియాంక తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తికి ఫోన్‌లో చెప్పింది.

Also Read: అతడిది "ఆవిడా మా ఆవిడే " స్టోరీనే కానీ తెలియకుండా మేనేజ్ చేసేశాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ..! ఎందుకంటే ?

అతడి సలహా మేరకు శ్రీనివాస్‌ మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి అదే రోజు రాత్రి బైక్‌పై విజయపురికాలనీ బస్టాప్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా జాగ్రత్తపడ్డారు. మృతుడి జేబులో ఏటీఎం కార్డు లభించడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులు సాయికుమార్, ప్రియాంకలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !

Also Read: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Jan 2022 03:06 PM (IST) Tags: Hyderabad crime news vanasthalipuram extra marital affair film nagar miryalaguda news

సంబంధిత కథనాలు

Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్‌నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!

Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్‌నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు

Karimnagar News :  కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు

Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి

Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక

Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక

Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి

Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ