News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Two Husbands One Wife : ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఇద్దరు భర్తలు... ఓ భార్య మధ్యలో ఇద్దరు పిల్లల రోదనల దృశ్యం అందర్నీ కదిలించింది. చివరికి ఆ మహిళ పిల్లలు, మొదటి భర్తను వదిలి రెండో భర్తతో వెళ్లిపోయింది.

FOLLOW US: 
Share:

అమ్మా.. అమ్మా అంటూ పిల్లలు కాళ్లు పట్టుకున్నారు !
కన్నీళ్లతో భర్త దూరంగా నిలబడ్డాడు !
మరో భర్త మరో వైపు దూరంగా నిలబడి చూస్తున్నాడు !
ఇప్పుడు ఆ మహిళకు రెండే దారులున్నాయి.  ఒకటి పిల్లతో కలిసి మొదటి భర్త వద్దకు వెళ్లడం. రెండోది ... అందర్నీ వదిలేసి రెండో భర్త వద్దకు వెళ్లడం. చాలా పిల్లలు బతిమిలాడారు. కానీ ఆమె చివరికి పిల్లల్ని మొదటి భర్తను వదిలేసి..రెండో భర్తతోనే వెళ్లాలని నిర్ణయించింది. ఈ సీన్ హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌ వేదికగా చోటు చేుకుంది. 

Also Read: అతడిది "ఆవిడా మా ఆవిడే " స్టోరీనే కానీ తెలియకుండా మేనేజ్ చేసేశాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ..! ఎందుకంటే ?

వరంగల్‌కు చెందిన ఓ మహిళకు ఇరవై ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆమె మొదటి భర్త పేరు శశికాంత్. ఇటీవల ఆమె ఇంట్లో ఉన్న డబ్బు, దస్కం తీసుకుని వెళ్లిపోయింది. దీంతో శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి పోలీసులు ఆమె హైదరాబాద్‌లో సత్యవరప్రసాద్ అనే వ్యక్తితో కలిసి జీవిస్తోందని తెలుసుకుని పట్టుకుని జైలుకు పంపారు. ఆమె బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తనపై మొదటి భర్త చేసిన ఆరోపణలు అన్నీ అబద్దమని... చెప్పేందుకు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్ పెట్టింది. ఈ ప్రెస్‌మీట్‌కు మొదటి భర్త..  పిల్లలు కూడా వచ్చారు. ఆ పిల్లలు తన పిల్లలు కాదని.. తన పిల్లలు అయితే పోలీస్ స్టేషన్‌లో తనను టార్చర్ పెడుతున్నప్పుడు ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ఆ పిల్లలు తన అక్క పిల్లలని.. ఆమె చనిపోతే... తను పెంచానని చెబుతోంది. అయితే ఆ పిల్లలు మాత్రం తమ అమ్మేనని.. ఇంటికి రావాలని వేడుకున్నారు. కానీ ఆమె మనసు కరగలేదు.

Also Read: సూర్యాపేట కాలేజీలో ర్యాగింగ్, యువకుడ్ని రూంకి పిలిచి బట్టలిప్పించి.. బలవంతంగా ట్రిమ్మర్‌తో...!

ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుని ఆమె ఫేస్‌బుక్‌లో పరిచయమైన సత్యవరప్రసాద్‌తో కలిసి జీవించాడనికి వెళ్లిపోయింది. అతను తూ.గో జిల్లాకు చెందిన వ్యక్తి. అతనితో కలిసి ఆ జిల్లాలో జరిగిన ఓ సామూహిక వివాహ కార్యక్రమాల్లో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చి కాపురం పెట్టారు. కానీ పోలీసులకు చిక్కిపోయారు. అయితే ఇప్పుడు కూడా ఆమె పిల్లలు,మొదటి భర్త వద్దని డిసైడయింది ., రెండో భర్తతోనే ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ పిల్లలను తోసేసి తన దోవన తాను వెళ్లిపోయింది.  అక్కడున్న వారందరికీ బతుకు జట్కాబండి కార్యక్రమం లైవ్‌లో కనిపించినట్లయింది.  

Also Read: LB Nagar Youth Fight: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Jan 2022 08:25 PM (IST) Tags: Hyderabad crime Hyderabad hyderabad woman Wife of Husband Woman who left children with second husband

ఇవి కూడా చూడండి

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Crime News: కాపీ కొట్టావని నిందించిన టీచర్‌- మనస్తాపంతో విద్యార్థిని ఏం చేసిందంటే?

Crime News: కాపీ కొట్టావని నిందించిన టీచర్‌- మనస్తాపంతో విద్యార్థిని ఏం చేసిందంటే?

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన