By: ABP Desam | Updated at : 01 Dec 2021 05:15 PM (IST)
ఏకే రావుది ఆత్మహత్యే !
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకే రావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. ఏకే రావు అనుమానాస్పద స్థితిలో నవంబర్ 23వ తేదీన బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై విగత జీవిగా కనిపించారు. ఆయనను హత్య చేశారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల లోతైన దర్యాప్తు జరిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తమ విచారణ అంశాలను.. పోస్ట్‌మార్టం నివేదికలను పోల్చుకుని ఆత్మహత్యగా నిర్ధారించారు.
Also Read : అనంతపురంలో యువతి హత్య.. గర్భిణీగా తేల్చిన పోలీసులు, విచారణలో సంచలన విషయాలు
హత్య చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. అలాగే ఆయనను హత్య చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునేందుకు రైలుకు ఎదురుగా వెళ్లారని ఆ సమయంలో షాక్‌కు గురై రైలు పట్టాలపై పడిపోయారని.. అందువల్లే గాయాలు అయినట్లుగా బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.
Also Read: బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!
ఏకే రావు పెద్ద కుమార్తె హరిణి రావు గాయని కాగా.. చిన్న కుమార్తె శాలినీ రావు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఆయన ఓ లోన్ కన్సల్టెన్సీని భాగస్వాములతో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ లోన్ కన్సల్టెన్సీ రుణాలిస్తామని నమ్మించి మోసం చేశారని కొంత మంది బెంగళూరులో కేసు పెట్టారు. ఆ కేసు విషయంలో ఆయన మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు బెంగళూరు వచ్చిన ఆయన చివరికి విగతజీవిగా కనిపించారు.
Also Read : బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!
ఏకే రావు సుజనా ఫౌండేషన్ సీఈవోగా పని చేస్తూండటంతో ఈ ఆయన మృతి రాజకీయంగానూ కలకలం రేపింది. ఆయనకు కొన్ని రియల్ ఎస్టేట్ వివాదాలున్నాయని కొంత మంది పని గట్టుకుని ప్రచారం చేశారు. అయితే అలాంటివేమీ లేదని తేలడంతో మిస్టరీ వీడినట్లయింది. ఏకే రావు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన కొంత మందితో కలిసి లోన్ కన్సల్టెన్సీ పెట్టారు. ఇక్కడే ఆయన మోసానికి గురయ్యారు. ఈ కారణంగానే ఆయన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read : వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి
Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం
Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
/body>